కథల వేటలో మెగాస్టార్..!

వాల్తేరు వీరయ్యతో సక్సెస్ అందుకున్న చిరు తన నెక్స్ట్ సినిమ భోళా శంకర్ తో కూడా అదే రిజల్ట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.మెహెర్ రమ్హేష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ సిస్టర్ రోల్ చేస్తుంది.

 Megastar Chiranjeevi Searching For His Next Movie Stories,chiranjeevi,,god Fathe-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత చిరు వెంకీ కుడుములతో ఒక సినిమా చేయాల్సి ఉంది.కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలట్లేదు.

అందుకే చిరంజీవి కథల చర్చల్లో ఉన్నారట.తన నెక్స్ట్ సినిమాలకు కథ వేట మొదలు పెట్టారట చిరు.

అయితే ఇప్పటికే చాలా కథలు వినడం జరిగిందట కానీ ఒక్క కథ కూడా మెచ్చలేదని టాక్.

అంతేకాదు చిరుని ఇంప్రెస్ చేసే లైన్ ఒక్కటి కూడా రైటర్స్, డైరెక్టర్స్ తీసుకురావట్లేదని అంటున్నారు.

పోనీ మరో రీమేక్ ఏదైనా చేద్దామా అంటే గాడ్ ఫాదర్ రిజల్ట్ చూశాక చిరు ఇక మీదట రీమేక్ లని అసలు చేయకూడదు అని ఫిక్స్ అయ్యారు.అందుకే రైటర్స్ అండ్ డైరెక్టర్స్ కి తనకు సూటయ్యే కథలని సిద్ధం చేసుకుని రమ్మని చెబుతున్నారట.

భోళా శంకర్ పూర్తి చేసే లోగానే మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు చిరు.మరి ఆ లక్కీ ఛాన్స్ ఏ డైరెక్టర్ అందుకుంటారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube