మెగాస్టార్ చిరంజీవి.ఇప్పటికే 150 సినిమాలకు పైగా నటించి ఈ టాలీవుడ్ టాప్ హీరో.ఇప్పటికే అదే ఊపులో ముందుకు సాగుతున్నారు.ప్రస్తుతం కొరటా శివతో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్టు చేస్తున్నారు.అంతే కాదు మరో మూడు భారీ బడ్జెట్ సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ సినిమాలకు ఆయన భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.
ఇంతకీ ఆయన చేయబోతున్న ఆ సినిమాలు ఏంటి? తీసుకోబోతున్న పారితోషకం ఎంత అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత సైతం వరుసగా మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పాడు చిరంజీవి.ఆచార్య అనంతరం మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం అనే సినిమా రీమేక్ చేయబోతున్నాడు.
ఈ సినిమా తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన లూసీఫర్ రీమేక్‌లో నటించనున్నాడు.
ప్రస్తుతం చర్చలు పూర్తి చేసుకున్న ఈ సినిమాల్లో ముందుగా వేదాళం రీమేక్ తెర మీదకు రానుంది.తొలుత ఈ సినిమా చేయాలని చిరు భావిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా అయిపోయాయి.
ఈ రెండు సినిమాల తర్వాత సర్దార్ గబ్బర్‌సింగ్ దర్శకుడు బాబి దర్శకత్వంలో మరో మూవీ చేసేందుకు చిరు ఓకే చెప్పాడు.
ఇప్పటికే ఈ సినిమాకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది షూటింగ్ జరుపుకోనున్నాయి.ఈ మూడు సినిమాల్లో ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకోవాలని భావిస్తున్నాడట.
మొత్తం మూడు సినిమాలకు 150 కోట్లు రూపాయల రెమ్యునరేషన్ మెగాస్టార్ అందుకోనున్నాడు.అయితే ఈ సినిమాలను ఎవరు నిర్మాస్తారు? అనే అంశంపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.