మెగాస్టార్ చిరంజీవి మాత్రమే సాధించిన ఈ అరుదైన రికార్డ్ గురించి తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాధించిన రికార్డులు అన్నీఇన్నీ కావు.చిరంజీవి రీఎంట్రీలో కూడా ఖైదీ నంబర్ 150 సినిమా సక్సెస్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

 Megastar Chiranjeevi Rare Record With Adivi Donga Movie Details, Megastar Chiran-TeluguStop.com

ప్రస్తుతం నిదానంగా సినిమాలు చేస్తున్న చిరంజీవి గతంలో వేగంగా సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి.చిరంజీవి నటించిన విజేత, అడవి దొంగ సినిమాలు కేవలం నెల రోజుల గ్యాప్ లో థియేటర్లలో విడుదలయ్యాయి.

ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ నంబర్ వన్ స్థానంలో ఉన్నారు.నంబర్ వన్ స్థానం కోసం హీరోల మధ్య పోటీ ఉన్న సమయంలో ఖైదీ సినిమా రిలీజ్ కావడంతో చిరంజీవి ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నారు.స్వయంకృషితో ప్రేక్షకుల్లో క్రేజ్ ను పెంచుకున్న చిరంజీవి టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ తన స్థాయిని అంతకంతకూ పెంచుకున్నారు.1985 సంవత్సరంలో చిరంజీవి నటించి విడుదలైన అడవి దొంగ ఆయన రేంజ్ ను మరింత పెంచింది.

చిరంజీవి రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

Telugu Adivi Donga, Chiranjeevi, Raghavendra Rao, Khaidi, Rare, Vijetha-Movie

ఈ సినిమా రిలీజైన తర్వాత వారం రోజుల్లోనే ఈ సినిమాకు ఏకంగా 84 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.చిరంజీవితో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించినా నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉండదని ఈ సినిమాతో ప్రూవ్ అయింది.హైదరాబాద్ లోని కోణార్క్, జ్యోతి, సత్యం, దేవి థియేటర్లలో 1985 సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

Telugu Adivi Donga, Chiranjeevi, Raghavendra Rao, Khaidi, Rare, Vijetha-Movie

హైదరాబాద్ సినీ హిస్టరీలో రిలీజ్ రోజున నాలుగు థియేటర్లలో ఐదు షోలు ప్రదర్శించబడిన తొలి సినిమా అడవి దొంగ కాగా ఈ సినిమాతో ఈ అరుదైన రికార్డ్ మెగాస్టార్ ఖాతాలో చేరింది.అడవి దొంగ సినిమాలో చిరంజీవి టార్జాన్ తరహా పాత్రలో నటించగా ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఈ సినిమాలో ఇంటర్వెల్ వరకు చిరంజీవికి మాటలు ఉండకపోవడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం కొంత ఫీలయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube