మీడియాపై మెగాస్టార్ పంచ్ అదిరింది..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఉదయాన్నే తన ఓట్ వేశారు.ఓటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన చిరు ఈసారి ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయని అన్నారు.

 Megastar Chiranjeevi Punch To Media Maa Elections, Maa Elections, Megastar Chira-TeluguStop.com

పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయని ఎప్పుడు ఒకెలా ఉండవని అన్నారు.ఈ రేంజ్ లో వాడి వేడిగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని చిరు అన్నారు.

అయితే తర్వాత ఎన్నికలు ఇలా జరుగకుండా చూస్తామని అన్నారు.కొందరు షూటింగ్స్ లో ఉండటం వల్ల ఓటింగ్ కు రాలేకపోతున్నారని.

వారిని ఏమి అనలేమని అన్నారు.

ఇక పనిలో పనిగా మీడియాపై పంచ్ కూడా వేశారు చిరు.

మీ మీడియాకి మంచి మెటీరియల్ దొరికిందని చిరు అన్నారు.అంటే మా ఎలక్షన్స్ హడావిడి గత నెల రోజులుగా మీడియా చేస్తున్న హంగామా దృష్టిలో ఉంచుకుని చిరు అలా అన్నారని అంటున్నారు.

ఇక చిరుతో పాటుగా చరణ్, పవన్, నాగ బాబు మెగా ఫ్యామిలీ హీరోస్ లో వీరంతా తమ ఓటింగ్ వేశారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ల మధ్య గట్టి పోటీ ఏర్పడగా ఈసారి ఎవరు అధ్యక్ష పదవి దక్కించుకుంటారో చూడాలి.

 ఎప్పుడూ లేనిది ఈ రేంజ్ లో మా ఎలక్షన్స్ రచ్చ జరగడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube