చిరు తో పవన్ కి చెక్ ? కేసీఆర్ మామూలోడు కాదు  

ఎక్కడ ఏ రకమైన ఎత్తుగడ వేస్తే వర్కౌట్ అవుతుందో తెలంగాణ సీఎం, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు బాగా తెలుసు.పార్టీపరంగా చుట్టూ ఆపదలు చుట్టుముట్టినా,  వాటిని లెక్క చేయకుండా,  తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కెసిఆర్ ది అందెవేసిన చేయి.

TeluguStop.com - Megastar Chiranjeevi Possitive Comments On Kcr

అవును రాజకీయాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి ఎవరికీ ఒకపట్టాన అర్థం కావు.ప్రస్తుతం జి హెచ్ ఎం సి లో ఎన్నికల హడావుడి మొదలైంది.

అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలపై దృష్టి సారించాయి.ఫలితాలు పూర్తిగా తమకు అనుకూలంగా ఉండే విధంగా చేసుకుంటూ, ఎక్కడా పట్టు జారిపోకుండా చేసుకోవడంలో ఆయన సిద్ధహస్తులు.

TeluguStop.com - చిరు తో పవన్ కి చెక్ కేసీఆర్ మామూలోడు కాదు-Political-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం హోరాహోరీగా గ్రేటర్ ఎన్నికలు ప్రచారం జరుగుతోంది.కాంగ్రెస్ , బిజెపి, జనసేన, ఎంఐఎం ఇలా అన్ని పార్టీలు టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకున్నాయి.

ఇక ఈ ఎన్నికల్లో పట్టు సాధించకపోతే, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్థితి ఏవిధంగా ఉంటుందో,  కెసిఆర్ కు తెలియంది కాదు.ఇక్కడ ప్రతి ఓటు కీలకమే.

ఇక కొత్తగా పుట్టుకొచ్చిన శత్రువు జనసేన ను తట్టుకుంటూ,  ఆ పార్టీకి చెక్ పెట్టడంతో పాటు,  రాజకీయంగా పైచేయి సాధించేందుకు కేసీఆర్ మెగా అస్త్రాన్ని బయటకు తీసినట్లు గా కనిపిస్తున్నారు.తాజాగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు కొందరు ఇటీవల కలిసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సింది గా కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

ఈ వ్యవహారంపై తాజాగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కెసిఆర్ విజన్ కు తగ్గట్టుగా, తెలుగు సినీ పరిశ్రమ పురోగతి సాధించిందని, దేశంలో మొదటి స్థానంలో నిలుస్తుందని, చిరంజీవి కేసీఆర్ ని ప్రశంసిస్తూ, ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే గ్రేటర్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలోనే కేసీఆర్ ను సినీ పెద్దలు కలవడం వారికి వరాల జల్లు కురిపించడం, వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి.

అయితే ఇదంతా పవన్ కు బీజేపీకి చెక్ పెట్టేందుకే కెసిఆర్ ఇది వ్యూహాత్మకంగా చేసినట్లుగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.దీని ద్వారా సినీ పరిశ్రమ తో పాటు,  మెగాస్టార్ చిరంజీవి అండదండలు టిఆర్ఎస్ కు ఉన్నాయి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు గా కనిపిస్తున్నారు.దీని ద్వారా గ్రేటర్ పరిధిలో ఉన్న మెగా అభిమానులు పవన్ , బిజెపి వైపు వెళ్లకుండా, టీఆర్ఎస్ వైపు వచ్చే విధంగా చెక్ పెట్టారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

#Elections #Telangana #Janasena #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Megastar Chiranjeevi Possitive Comments On Kcr Related Telugu News,Photos/Pics,Images..