రాజ్యసభ సీటుపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

Megastar Chiranjeevi On Ys Jagan Offers Rajya Sabha Seat

వరుసగా రెండో రోజు మెగాస్టార్ చిరంజీవి విజయవాడకు వచ్చారు.సతీసమేతంగా హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.

 Megastar Chiranjeevi On Ys Jagan Offers Rajya Sabha Seat-TeluguStop.com

ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.చిరంజీవిని వైసీపీ ప్రభుత్వం రాజ్యసభకు పంపబోతోందనే ప్రచారం జరుగుతోంది.

రాజ్యసభ ఆఫర్ వార్తలను ఆయన తోసిపుచ్చారు.తాను రాజకీయాలకు పూర్తి దూరమని స్పష్టం చేశారు.

వైసీపీ తనకు రాజ్యసభ ఆఫర్ చేసిందని వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు.వైసీపీ తనకు రాజ్యసభ ఇస్తానన్నది ఊహాజనితమేనని వ్యాఖ్యానించారు.

రాజకీయాలకు తాను అతీతమని తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని చెప్పారు.

ఇలాంటి ఆఫర్లను తాను కోరనని ప్రకటించారు.అటువంటి వాటికి తాను దూరమని చిరంజీవి స్పష్టం చేశారు

.

Megastar Chiranjeevi Response on Rajya Sabha Seat Offer

#YS Jagan #Vijayawada #Chiranjeevi #AP #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube