జగన్ కు ‘ మెగా ‘ హ్యాండ్ ? అసలు సంగతేంటి ?  

Megastar Chiranjeevi not interested on AP issues Chiranjeevi, Jagan, Ap, Hyderabad, Vizag Film Studio, Allu Aravindh, Allu Studios, Amarvathi, Chiranjeevi And Jagan, Pawan Kalyan, Janasena - Telugu Allu Aravind, Amravati, Ap Politics, Chiranjeevi, Cinema Studio, Hyderabad, Jagan, Janasena Party, Pawan Kalyan, Ysrcp

మెగాస్టార్ చిరంజీవి వ్యవహారం మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది.వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిరంజీవి తో చాలా సన్నిహితంగానే మెలిగారు.

TeluguStop.com - Megastar Chiranjeevi Not Interested On Ap Issues

కుటుంబ సమేతంగా వెళ్లి జగన్ ఆతిథ్యం స్వీకరించి ప్రశంసలతో ముంచెత్తారు. జగన్ సైతం చిరంజీవికి అదేస్థాయిలో ప్రాధాన్యం ఇచ్చి చిరంజీవి కోరిన కొన్ని డిమాండ్లను తీర్చేందుకు సైతం జగన్ ఒప్పుకోవడం, ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకోవడం వంటి వ్యవహారాలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి  తమ్ముడు జనసేన పార్టీ పెట్టి, రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్నా, చిరంజీవి ఆయనకు మద్దతు ప్రకటించకపోగా, రాజకీయ శత్రువులా చూస్తున్న జగన్ ను అభినందించడం పెద్ద సంచలనంగా మారింది.

ఆ వ్యవహారం అలా ఉండగానే, మరోసారి చిరంజీవి ఓ సందర్భంలో స్పందిస్తూ జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతు ప్రకటించారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మూడు రాజధానులు ఉండి తీరాల్సిందే అంటూ చిరంజీవి చెప్పడం పెద్ద దుమారమే రేపింది.

TeluguStop.com - జగన్ కు మెగా హ్యాండ్ అసలు సంగతేంటి -Political-Telugu Tollywood Photo Image

ఈ వ్యవహారం లో జగన్ చిరంజీవిల బంధం మరింతగా బలపడింది.ఇక కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలోనూ చిరంజీవి ఆధ్వర్యంలోని కొంతమంది సినీ ప్రముఖులు ప్రత్యేక విమానంలో ఏపీకి వచ్చి జగన్ ను కలిసి అనేక విషయాలపై చర్చించారు.

ఈ సందర్భంగా అమరావతి ప్రాంత రైతుల నుంచి నిరసన వ్యక్తమైనా, వారు పట్టించుకోలేదు.అయితే ఈ తతంగమంతా చిరంజీవి విశాఖలో స్టూడియో నిర్మించేందుకు అని ప్రచారం జరిగింది.

ఇక చిరంజీవి సైతం విశాఖలో ఎప్పటి నుంచో సినిమా స్టూడియో నిర్మించాలని చూస్తుండడంతో, ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.

అయితే కొంతకాలంగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజధాని పై క్లారిటీ రాకపోవడం, ఈ పరిణామాలన్నింటినీ లెక్కలు వేసుకున్న చిరంజీవి హైదరాబాద్ లోని, ఔటర్ రింగ్ రోడ్ లో తనకు ఉన్న 10 ఎకరాల స్థలంలో నే స్టూడియో ను నిర్మించాలని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ నాచారం సమీపంలో ఉన్న భూముల్లో అల్లు స్టూడియోస్ పేరిట శంకుస్థాపన కూడా చేశారు.ఈ వ్యవహారాలన్నీ చూస్తే, చిరంజీవి హైదరాబాద్ ను వదిలి ఏపీ వైపు అడుగులు వేయడం కష్టమే అనే విషయం అర్థమవుతుంది.

అంటే ఏపీ విషయాలపైన జగన్ కు మద్దతు ఇచ్చే విషయంలో చిరంజీవి ముందుకు వచ్చే అవకాశం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.

#Pawan Kalyan #Allu Aravind #Jagan #Ysrcp #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Megastar Chiranjeevi Not Interested On Ap Issues Related Telugu News,Photos/Pics,Images..