ప్రకాష్ రాజ్ చేస్తున్న పనులు మెగాస్టార్ కు నచ్చట్లేదా.. అలాంటి ఆవేదనతో?

Megastar Chiranjeevi Not Happy With Prakash Raj Works

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు మెగా క్యాంప్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.నాగబాబు సైతం చిరంజీవి మద్దతు ప్రకాష్ రాజ్ కు ఉందని చెప్పుకొచ్చారు.

 Megastar Chiranjeevi Not Happy With Prakash Raj Works-TeluguStop.com

అయితే ఎన్నికలలో గెలవడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విష్ణు విజయం సాధించారు.విష్ణు అధ్యక్ష పదవికి ఎంపికైన తర్వాత అక్కడితో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అందరూ భావించారు.

అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేసి తన ప్యానల్ తరపున గెలిచిన వాళ్లతో సైతం రాజీనామా చేయించారు.ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన తీరు గురించి ప్రకాష్ రాజ్ కోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.

 Megastar Chiranjeevi Not Happy With Prakash Raj Works-ప్రకాష్ రాజ్ చేస్తున్న పనులు మెగాస్టార్ కు నచ్చట్లేదా.. అలాంటి ఆవేదనతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెగే వరకు ప్రకాష్ రాజ్ లాగడం సరికాదని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

Telugu Maa, Chiranjeevi, Happy Works, Prakash Raj, Prakashraj-Movie

అయితే మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు చిరంజీవికి ఏ మాత్రం నచ్చడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రకాష్ రాజ్ సొంతంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతున్నారని తెలుస్తోంది.మెగా వర్గం తనకు ఓపెన్ గా మద్దతు ప్రకటించి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని ప్రకాష్ రాజ్ ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది.

Telugu Maa, Chiranjeevi, Happy Works, Prakash Raj, Prakashraj-Movie

చిరంజీవి ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు సైలెంట్ అయిపోవాలనే సందేశాన్ని పంపారని అయితే ప్రకాష్ రాజ్ మాత్రం ఆ సందేశాన్ని కూడా పట్టించుకోలేదని తెలుస్తోంది.ప్రకాష్ రాజ్ తన ప్రవర్తనతో తప్పు చేస్తున్నాడని అభిప్రాయాలు వినిపిస్తుండటం గమనార్హం. చిరంజీవి సైతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదానికి వీలైనంత దూరంగా ఉంటూ అందరివాడు అనిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు బోగట్టా.  ప్రకాష్ రాజ్ ఏ విధంగా ముందుకు వెళతాడో చూడాల్సి ఉంది.

#Happy Works #Prakash Raj #Chiranjeevi #MAA #PrakashRaj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube