సీటిమార్ డైరక్టర్ తో మెగాస్టార్..!

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరక్టర్స్ లో సంపత్ నంది ఒకరు.రాం చరణ్ తో రచ్చ చేసిన టైం లోనే స్టార్ డైరక్టర్ అవ్వాల్సినసంపత్ నంది ఎందుకో వెనకపడ్డాడు.

 Megastar Chiranjeevi Movie With Seetimaar Sampath Nandi, Seetimaar, Megastar Chi-TeluguStop.com

ఈమధ్యనే గోపీచంద్ తో సీటీమార్ అంటూ వచ్చి సత్తా చాటిన డైరక్టర్ సంపత్ నంది త్వరలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.గోపీచంద్ సీటీమార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ కు ముందు సంపత్ నంది చిరంజీవిని కలవడం జరిగింది.

ఈ మీటింగ్ లోనే ఏదైనా కథ ఉంటే చెప్పమని చిరు అన్నారట.

సంపత్ నంది లైన్ చెప్పడంతో చిరు ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది.

ఫుల్ స్క్రిప్ట్ తెస్తే చూద్దామని చెప్పారట.ఆచార్య తర్వాత వరుసగా భోళా శంకర్, గాడ్ ఫాదర్, కె.ఎస్ రవీంద్ర సినిమాలను చేస్తున్న చిరంజీవి మరో యువ దర్శకుడిని లైన్ లో పెడుతున్నారని తెలుస్తుంది.సంపత్ నందికి ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తే మాత్రం అతని కెరియర్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంటుంది.

సీటీమార్ తో మరోసారి తన మాస్ డైరక్షన్ టాలెంట్ చూపించిన సంపత్ నందితో యువ హీరోలు సినిమా చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube