శంకర్ తో మెగాస్టార్ చిరంజీవి సినిమా.. ఈ సారి జత కుదిరేనా.... ఇంతకీ ఈ సినిమా నిర్మాత ఎవరంటే...  

Megastar Chiranjeevi Movie With Director Shankar-

శంకర్ ఈ పేరు చెప్పగానే భారీ బడ్జెట్ , సోషల్ మెసేజ్ లు గుర్తుకొస్తాయి. 2000 సంవత్సరానికి ముందే భారత సినిమా స్థాయి ని పెంచే అద్భుతమైన సినిమాలు తీసారాయన. ఆయన తీసే ప్రతి సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా బాక్స్ ఆఫీస్ విజయాలు సాధించాయి. ఇటీవల వచ్చిన రోబో 2.0 సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తీసి ప్రేక్షకులకి నూతన అనుభూతిని కలిగించాడు. ప్రస్తుతం శంకర్ భారతీయుడు షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు..

శంకర్ తో మెగాస్టార్ చిరంజీవి సినిమా.. ఈ సారి జత కుదిరేనా.... ఇంతకీ ఈ సినిమా నిర్మాత ఎవరంటే...-Megastar Chiranjeevi Movie With Director Shankar

అయితే శంకర్ భారతీయుడు 2 తరువాత తెలుగు లిప్ ఒక సినిమా తీసేందుకు అంగీకరించడట. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా. అతనే మెగాస్టార్ చిరంజీవి. శంకర్ తో కలిసి పని చేయాలని చిరు ఎప్పటి నుండో అనుకుంటున్నాడు.

శంకర్ తీసిన మొదటి సినిమా జెంటిల్మెన్ చిరు కి అప్పట్లో తెగ నచ్చేయడం తో ఆ సినిమాని హిందీ లో చిరు రీమేక్ చేశారు. అప్పటి నుండి శంకర్ తో పని చేయాలనుకున్న చిరంజీవి గారి ఆశ త్వరలో నెరబోతుంది.

ప్రతుతం మెగాస్టార్ సైరా సినిమా షూట్ లో బిజీ ఉన్నాడు. ఆ సినిమా అయ్యాక కొరటాల శివ , త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేయాల్సి ఉంది. అయితే చిరు కి శంకర్ ఇంకా స్టోరీ చెప్పాల్సి ఉంది..

ఈ సినిమా చర్చల నిమిత్తం అల్లు అరవింద్ ఇటీవలే చెన్నై లో శంకర్ కలిసాడట. ఈ సినిమా ని తెలుగు లో చిరంజీవి హీరోగా , తమిళ్ లో విజయ్ లేదా అజిత్ హీరో గా తెరకెక్కించాలని అనుకుంటున్నారు. ఈ సినిమాని తెలుగు , తమిళ్ భాషలలో అల్లు అరవింద్ నిర్మాతగా ఉండబోతున్నాడు.

ఒకవేళ అన్ని కుదిరి శంకర్ తో సినిమాకి చిరు ఒకే అనేస్తే మెగా ఫ్యాన్స్ కి ఇక పండగే…