చిరంజీవికి విపరీతంగా నచ్చేసిన బ్లఫ్ మాస్టర్ సినిమా

సత్యదేవ్ హీరోగా గోపి గణేష్ దర్శకత్వంలో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా రెండేళ్ళ క్రితం వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా కంటెంట్ పరంగా ఒకే అనిపించుకొని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

 Megastar Chiranjeevi Is All Praises For Bluff Master Director, Tollywood, Telugu-TeluguStop.com

అయితే సినిమా థియేటర్ లో ఆశించిన స్థాయిలో ఆడలేదు.టెలివిజన్ లో మాత్రం ఈ సినిమాకి మంచి రేటింగ్స్ వచ్చాయి.

ఈ సినిమాలో సత్యదేవ్ యాక్టింగ్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి సినిమాపై ప్రశంసలు కురిపించారు.

చిరంజీవికి ఒక సినిమా నచ్చింది అంటే కచ్చితంగా అందులో ఏదో ఒక విశేషం ఉండాలి.ఏ సినిమా గురించి మెగాస్టార్ అంతగా పొగడ్తలు కురిపించరు.

అయితే తాజాగా బ్లఫ్ మాస్టర్ సినిమా చూసిన చిరంజీవి దర్శకుడుని ఇంటికి పిలిపించుకొని సినిమాపై ప్రశంసలు కురిపించారు.

తన కుటుంబసభ్యులతో కలిసి సినిమాను వీక్షించిన చిరుకి సినిమా చాలా భాగా నచ్చిందని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి పిలుపుతో దర్శకుడు గోపీ గణేష్ ఆయన ఇంటికి వెళ్లి గంటపాటు ఈ సినిమా గురించి చర్చించినట్లు తెలుస్తుంది.తనకిష్టమైన సీన్లు, డైరెక్షన్‌ పనితీరుపై ప్రశంసలు కురిపించినట్టు ఫిలింనగర్‌ వర్గాల టాక్‌.

చిరంజీవితో గోపీ గణేశ్‌ దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ఇక అదే సమయంలో మంచి కథ ఉంటే సిద్ధం చేసుకోమని కూడా సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది.

అతను కథ సిద్ధం చేస్తే మెగా కాంపౌండ్ హీరోతో సినిమా చేసే అవకాశం గోపీ గణేష్ కి ఇవ్వాలని చిరంజీవి యోచిస్తున్నట్లు బోగట్టా.మరి చిరంజీవి ఆఫర్ ని గోపీ గణేష్ ఎంత వరకు ఉపయోగించుకుంటారు అనేది వేచి చూడాలి.

చిరంజీవికి విపరీతంగా నచ్చేసిన బ్లఫ్ మాస్టర్ సినిమా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube