పావలా శ్యామలని ఆదుకున్న మెగాస్టార్.. ప్రతి నెల అంత వచ్చేలా?

టాలీవుడ్ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి నటన విషయంలోనే కాకుండా నట జీవితం లోని కాకుండా నిజజీవితంలో కూడా మంచి పేరు సొంతం చేసుకున్నాడు.సహాయం చేయడానికి వెనకాడని వ్యక్తిగా నిలిచాడు చిరంజీవి.

 Chiranjeevi Provides Financial Support To Pavala Shyamala,  Pavala Shyamala, Chi-TeluguStop.com

ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే చాలు వెంటనే ఆదుకుంటాడు.సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండే చిరంజీవి.

ఇటీవలే పావలా శ్యామల పరిస్థితి తెలుసుకొని మరోసారి తనకు సహాయం చేశాడు.


కొన్ని రోజుల కిందట టి ఎన్ ఆర్ మరణించగా ఆయన కుటుంబానికి కూడా తన వంతు సహాయం చేశాడు.

ఇక ఇటీవలే తెలుగు ఆర్టిస్ట్ పావలా శ్యామల ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందని, ఇంటి రెంట్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉందని తనకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ కూడా సరిగా రావట్లేదని కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.అంతే కాకుండా ప్రతి ఒక్కరు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరుతూ.

దీంతో దీనికి స్పందించిన చిరంజీవి తన వంతు సహాయాన్ని అందించాడు.

Telugu Chiranjeevi, Karate Kalyani, Pavala Shyamala, Pavalashyamala, Tollywood-M

ఎటువంటి ఉపాధి లేక బతుకుతున్న పావలా శ్యామల కి మెగాస్టార్ చిరంజీవి ‘మా’ తరఫున సభ్యత్వ కార్డు తీసుకునే నిమిత్తం అందించాడు.అంతేకాకుండా లక్ష 15 వందల చెక్ ను కూడా పంపించాడు.ఇక చెక్ ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పీసీసీ సభ్యులు కరాటే కళ్యాణి, సురేష్ కొండేటి స్వయంగా శ్యామలా కి అందించారు.

ఇకపై కొత్త సభ్యురాలైన పావలా శ్యామల కి మా మెంబర్ షిప్ కార్డు తో తనకు నెలకు 6 వేల చొప్పున ప్రతి నెల పెన్షన్ అందేలా చేశాడు చిరంజీవి.అంతేకాకుండా సభ్యత్వం తీసుకున్న ఏ ఆర్టిస్ట్ అయిన అకాల మరణం చెందితే 3లక్షల ఇన్సూరెన్స్ కూడా వస్తుంది.


ఇక ఈ విధంగా పావలా శ్యామల మాట్లాడుతూ.గతంలో చిరంజీవి తనకు రెండు లక్షల ఆర్థిక సాయం చేశాడని చెప్పుకొచ్చింది.

అప్పుడు తను ఎంతో కష్టం లో ఉన్నాం అంటూ ఆ డబ్బులు తనని ఎంతో ఆదుకున్నాయని తెలిపింది.ఇప్పుడు మళ్లీ కష్టంలో ఉన్నప్పుడు సహాయ పడినందుకు ఎప్పటికి రుణపడి ఉంటానని తెలిపింది పావలా శ్యామల.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube