మెగాస్టార్ మంచి మనస్సు.. మరణించిన ఫ్యాన్ కూతురు కోసం ఏం చేశారంటే?

తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమాన హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి సాయం కోరిన వాళ్లకు తన వంతు సహాయం చేయడంలో ముందువరసలో ఉంటారు.అభిమానుల వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని చాలా సందర్భాల్లో చిరంజీవి చెప్పుకొచ్చారు.

 Chiranjeevi Helps His Fan Financially For His Daughters Education, Chiranjeevi,-TeluguStop.com

అభిమానులకు ఏదైనా కష్టం వస్తే సహాయం చేయడంలో చిరంజీవి ముందువరసలో ఉంటారు.చిరంజీవి తన అభిమానులను సైతం బ్లడ్ బ్రదర్స్ అని పిలుస్తారు.

అభిమానులను కుటుంబ సభ్యులలా చూడటంతో పాటు ఏదైనా ఆపద వస్తే ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడే విషయంలో చిరంజీవి వెనుకడుగు వేయరు.చిరంజీవి యువత అధ్యక్షుడైన డి సురేష్ అనే వ్యక్తి 2010 సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

హయత్ నగర్ మండలానికి చిరంజీవి ఆ సమయంలో అధ్యక్షుడిగా ఉండేవారు.సురేష్ మృతి చెందిన సమయంలో చిరంజీవి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

సురేష్ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడతానని చిరంజీవి ఆ సమయంలో మాటిచ్చారు.

Telugu Rs, Acharya, Bhola Shankar, Chiranjeevi, Suresh, Asha, Daughters, Fee, Go

చిరంజీవి ఆ మాటను నిలబెట్టుకుంటూ సురేష్ కూతురు అశ్వితకు సంబంధించిన ఖర్చులన్నీ తానే భరిస్తానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ఈ సంవత్సరం చదువులకు సంబంధించి చిరంజీవి 10,000 రూపాయల చెక్కును అశ్వితకు స్కూల్ ఫీజులకు సంబంధించి అందజేశారు.

Telugu Rs, Acharya, Bhola Shankar, Chiranjeevi, Suresh, Asha, Daughters, Fee, Go

చిరంజీవి అశ్విత భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.మరోవైపు చిరంజీవి నటించిన ఆచార్య రిలీజ్ డేట్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.ఆచార్య సినిమా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయిందని తెలుస్తోంది.

మరోవైపు చిరంజీవి రీమేక్ లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని రాబోయే రోజుల్లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మరో రీమేక్ కు సంబంధించిన ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది.ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వేదాళం, భోళాశంకర్ సినిమాలు రీమేక్ సినిమాలు అనే సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube