చిరంజీవి మనవరాలి టాలెంట్ గురించి మీకు తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రతిభ గల నటుడనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పాట పాడినా, డ్యాన్స్ చేసినా, డైలాగ్ చెప్పినా చిరంజీవి స్టైలే సెపరేట్ అనే సంగతి తెలిసిందే.

 Megastar Chiranjeevi Grand Daughter Naveeksha Hidden Talent Details Here-TeluguStop.com

అయితే చిరంజీవిలా ఆయన మనవరాలు నవీక్ష కూడా టాలెంటెడ్ కావడం గమనార్హం.చిరంజీవి చిన్నకూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల గారాలపట్టి నవీక్ష కాగా గతేడాది చిరంజీవి మనవరాలు నవీక్షతో ఉన్న ఒక వీడియోను షేర్ చేశారు.

సంగీతానికి ఎంతో అద్భుతమైన శక్తి ఉందని సంవత్సరం వయస్సు ఉన్న చిన్నారి నవీక్ష మ్యూజిక్ ను ఎంజాయ్ చేయడంతో పాటు మ్యూజిక్ కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తోందని చిరంజీవి చెప్పుకొచ్చారు.చిరు మనవరాలితో కలిసి సందడి చేసిన ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకోవడంతో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

 Megastar Chiranjeevi Grand Daughter Naveeksha Hidden Talent Details Here-చిరంజీవి మనవరాలి టాలెంట్ గురించి మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే చిరంజీవి గ్రాండ్ డాటర్ నవీక్ష తన హిడెన్ టాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ఈ చిన్నారి తండ్రి కళ్యాణ్ దేవ్ జంతువుల పేర్లు చెబుతుంటే నవీక్ష తన వాయిస్ తో ఆ జంతువులు ఎలా అరుస్తాయో చెబుతూ ఆకట్టుకున్నారు.

తన క్యూట్ మాటలతో సాధారణ ప్రేక్షకులతో పాటు నెటిజన్లను సైతం నవీక్ష ఆకట్టుకున్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కళ్యాణ్ దేవ్ తన కూతురుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వార్తల్లో నిలుస్తున్నారు.

బాల్యంలోనే ఇంత టాలెంట్ ఉన్న చిన్నారి నవీక్ష రాబోయే రోజుల్లో బాలనటిగా ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది చాలామంది హీరోలు వెండితెరపై సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.

ఈ టాలెంటెడ్ చిన్నారి ఏ హీరో సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది.

#MegaGrand #Social Media #Animals Names #Grand Daughter #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు