చిరు సినిమాల జాతర.. 30 ఏళ్ల తర్వాత అభిమానులు కోరుకున్నట్లుగా!

1980 మరియు 1990 ల్లో మెగా స్టార్‌ చిరంజీవి సినిమాల జాతర సాగేది.అప్పట్లో ఒక్క ఏడాదికి అయిదు పది సినిమాలు చేసిన ఘనత చిరంజీవికి ఉంది.

 Megastar Chiranjeevi Four Movies Coming In Next Year Details, Chiranjeevi, Achar-TeluguStop.com

ఒక్క నెలలో రెండు మూడు సినిమాలు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది.ఎన్నో అద్బుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి మెగాస్టార్ గా నిలిచి గాడ్ ఆఫ్‌ తెలుగు సినిమాగా నిలిచిన ఘనత ఆయనకు దక్కింది.అలాంటిది గత మూడు దశాబ్దాలుగా ఆయన సినిమాల సంఖ్య తగ్గింది.1990 తర్వాత ఏడాదికి రెండు మూడు సినిమాలను మాత్రమే చిరంజీవి చేస్తూ వచ్చాడు.ఆ తర్వాత తర్వాత ఏడాదికి ఒకటి రెండు సినిమాలే వచ్చాయి.

ఈమద్య కాలంలో రెండేళ్లకు ఒక్క సినిమా కూడా వచ్చే పరిస్థితి లేదు.

ఒక్క చిరంజీవి విషయంలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క స్టార్ హీరో విషయంలో కూడా ఇదే జరుగుతోంది.అయితే కరోనా మార్చింది అందరిని అన్నట్లుగా చిరంజీవిని కూడా మార్చేసింది.

మునుపటి చిరంజీవి మనకు కనిపించబోతున్నాడు.రాజకీయాలతో పదేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయినా కూడా ఏమాత్రం ఆయన క్రేజ్ తగ్గలేదు అని ఖైదీ నెం.150 సినిమాతో నిరూపితం అయ్యింది.చిరంజీవి 2022 సంవత్సరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu Acharya, Bhola Shankar, Chiranjeevi, Bobby, Godfather, Koratala Siva, Meh

1990 తర్వాత అంటే ముప్పై ఏళ్లుగా చిరంజీవి నటించిన సినిమాలు ఒకే ఏడాది నాలుగు విడుదల అవ్వలేదు.మళ్లీ ఇన్నాళ్లకు సినిమా విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.చిరంజీవి నటించిన ఆచార్య సినిమా మొదలుకుని గాడ్ ఫాదర్‌.భోళాశంకర్ మరియు బాబీ దర్శకత్వంలో సినిమా లు వచ్చే ఏడాదిలోనే వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.ఈ జోరు స్పీడ్ నే చిరంజీవి అభిమానులు కోరుకున్నారు.ప్రతి ఒక్క హీరో కూడా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తే ఇండస్ట్రీ బాగుంటుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube