బ్రహ్మాస్త్ర కోసం మెగాస్టార్ కూడా..!

బాలీవుడ్ బాహుబలిగా రణ్ భీర్ కపూర్, అలియా భట్ జంటగా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర.అయాన్ ముఖర్జీ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ ఫిక్స్ చేశారు.

 Megastar Chiranjeevi For Brahmastra Movie , Brahmastra, Chiranjeevi, Megastar Ch-TeluguStop.com

కేవలం హిందీలోనే కాకుండా ఈసారి సౌత్ భాషల్లో కూడా బ్రహ్మాస్త్రని గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేశారు.ఈ సినిమాకు రాజమౌళి సమర్పకుడిగా ఉండటం కూడా ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు.

ఇప్పటికే రాజమౌళి మార్క్ ప్రమోషన్స్ బ్రహ్మాస్త్రకి షురూ చేశారు.రీసెంట్ గా వైజాగ్ లో బ్రహ్మాస్త్ర టీం సందడి చేసిన విషయం తెలిసిందే.

ఇదిలాఉంటే లేటెస్ట్ గా బ్రహ్మాస్త్ర సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా పనిచేయనున్నారని తెలుస్తుంది.బ్రహ్మాస్త్ర సినిమా కోసం చిరు ఏ విధంగా సపోర్ట్ అందిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.

ఒకవేళ సినిమాకు చిరు వాయిస్ ఓవర్ ఏమైనా ఇస్తారేమో అని అనుకుంటున్నారు.ఆల్రెడీ బ్రహ్మాస్త్ర సినిమాలో కింగ్ నాగార్జున నటిస్తున్నారు.ఇప్పుడు చిరు కూడా బ్రహ్మాస్త్రకి సపోర్ట్ చేస్తే ఆ సినిమా తప్పకుండా తెలుగులో మంచి ఇంప్యాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. రాజమౌళి వల్లే చిరు కూడా బ్రహ్మాస్త్రకి సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube