నటుడిగా నేను పుట్టింది అప్పుడే అంటూ ఎమోషనల్ అయిన మెగాస్టార్....

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినిమా కుటుంబం బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా అవకాశాలు దక్కించుకుని అంచలంచలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకొని నేటితరం నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్న టాలీవుడ్ “మెగాస్టార్ చిరంజీవి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలు పెట్టి దాదాపుగా 43 సంవత్సరాలు పూర్తయింది.

 Megastar Chiranjeevi Emotional To Post Shared About Pranam Khareedu Movie-TeluguStop.com

ఈ క్రమంలో దాదాపుగా 150 కి పైగా చిత్రాలలో చిరంజీవి హీరోగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.ఈ క్రమంలో ఎన్నో హిట్లు, ప్లాపులు అందుకున్నప్పటికీ పట్టు విడవకుండా శ్రమించి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కాగా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “ప్రాణం ఖరీదు” చిత్రం విడుదలయి ఇటీవలే 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.దీంతో తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయం గురించి స్పందించాడు.

 Megastar Chiranjeevi Emotional To Post Shared About Pranam Khareedu Movie-నటుడిగా నేను పుట్టింది అప్పుడే అంటూ ఎమోషనల్ అయిన మెగాస్టార్….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా ఆగస్టు 22వ తారీఖున తాను పుట్టిన రోజయితే సెప్టెంబర్ 22 వ తారీఖున తాను నటుడిగా పుట్టిన రోజని తెలిపాడు.అలాగే “కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు.

మీ అందరికీ నన్ను నటుడిగా పరిచయం చేసి మీ ఆశీస్సులు పొందిన రోజని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఈ రోజుని అసలు మర్చిపోలేనని కొంతమేర ఎమోషనల్ అయ్యాడు.అంతేకాకుండా ఈరోజు వల్లే తాను లక్షల అభిమానాన్ని పొందగలిగానని” తనను ఇంతగా ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

అలాగే ప్రాణం ఖరీదు చిత్ర షూటింగ్ సమయంలో తీసిన ఓ ఫోటోని కూడా షేర్ చేశాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో చిరంజీవి కి జోడీగా తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ నటిస్తోంది.ఈ చిత్రాన్ని తెలుగు ప్రముఖ హీరో మరియు మెగాస్టార్ చిరంజీవి తనడుయు “రామ్ చరణ్ తేజ్” కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

#Chiranjeevi #Pranam Khareedu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు