జగన్ కు ' మెగా ' ప్రశంసలు ! అసలు సంగతి ఇదా ?

ఊరికినే పొగడరు మహానుభావులు ! అనే సామెత ఊరికినే పుట్టలేదు.ఒకరితో మరొకరు కి ఉండే అవసరాల రీత్యా ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటూ ఉంటారు.

 Megastar Chiranjeevi Congratulates Jagan-TeluguStop.com

అసలు విషయానికొస్తే,  ఏపీ సీఎం జగన్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు.జగన్ పరిపాలన ను ప్రస్తావిస్తూ బ్రహ్మాండంగా ఏపీ అభివృద్ధి చెందుతోందని, అలాగే జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం చాలా గొప్పది అంటూ గతంలోనే చిరంజీవి పొగిడేశారు.

అలాగే జగన్ ఇంటికి వెళ్లి మరి ఆతిథ్యం స్వీకరించి వచ్చారు.  ఆ సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి చేసిన సూచనలను జగన్ సానుకూలంగా వినడమే కాకుండా,  వాటిని అమలు చేసి చిరు పై తమకున్న గౌరవాన్ని తెలియజేశారు.

 Megastar Chiranjeevi Congratulates Jagan-జగన్ కు మెగా ప్రశంసలు అసలు సంగతి ఇదా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నా, ఆయన ప్రత్యర్థిగా ఉన్న జగన్ ను చిరంజీవి పొగడడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా వై.సి.పి.లో రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయమై తీవ్రంగా కసరత్తు జరుగుతోంది.ఎవరెవరిని రాజ్యసభకు పంపించాలనే విషయంపై జగన్ సీరియస్ గా  దృష్టి పెట్టారు.

చిరంజీవి జగన్ పై ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.కొద్ది రోజుల క్రితం వైసీపీ తరఫున మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు పంపించబోతున్నారని , దీని ద్వారా ప్రధానంగా ఏపీలో ఉన్న కాపు సామాజికవర్గం ఓటర్లను తమవైపు తిప్పుకునే ఆలోచనలో ఉన్నారని , అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టినట్లు అవుతుంది అని జగన్ అభిప్రాయపడుతున్నారనే వార్తలు వచ్చాయి.

Telugu Ap Government, Carona, Chiranjivi Rajyasabha, Covid, Jagan, Janasena, Mega Star Chiranjivi, Pavan Kalyan, Vaccination, Ysrcp-Telugu Political News

 అయితే ఈ విషయం చిరు వరకు వెళ్లిందో లేదో తెలియదు గాని,  తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా చిరంజీవి జగన్ పై ప్రశంసలు కురిపించారు.జగన్ ప్రభుత్వం ఒక్క రోజే 13.72 లక్షల మందికి వాక్సిన్ లు వేయడాన్ని ప్రస్తావిస్తూ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.ఒక్కరోజులో ఆరోగ్య బృందాలు ఎంతమందికి టీకా వేయడం చాలా ఆనందంగా ఉంది.

కొవిడ్ ను తరిమికొట్టేందుకు మీరు చేసిన ప్రయత్నాలు ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని నింపుతాయి.ఇది మీ సమర్థ నాయకత్వాన్ని కి నిదర్శనం.

మీరు మరింత ముందుకు వెళ్లాలని కోరుతున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.అయితే ఇదంతా రాజ్యసభ కోసం చిరంజీవి చేస్తున్న ప్రయత్నమా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.

#Carona #Janasena #Vaccination #Jagan #AP Government

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు