మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా డ్యాన్స్ చేస్తారనే సంగతి తెలిసిందే.ఈతరం ప్రేక్షకులు కూడా చిరంజీవి డ్యాన్స్ కు ఫిదా అవుతారు.
చిరంజీవి డ్యాన్సుల కోసమే థియేటర్లకు వెళ్లే అభిమానులు ఉన్నారు.యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు అద్భుతంగా డ్యాన్స్ చేస్తే చిరంజీవి ప్రశంసిస్తారు.
మెగా ఫ్యామిలీ హీరోలలో రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా తమ డ్యాన్స్ లతో ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
అయితే చాలా సంవత్సరాల క్రితం కోడి రామకృష్ణ దర్శకత్వంలో హీరో కృష్ణ దొంగోడొచ్చాడు సినిమాలో నటించారు.
చెన్నైలోని శివాజీ గార్డెన్స్ లో దొంగోడొచ్చాడు మూవీ షూటింగ్ జరుగుతుండగా హీరో చిరంజీవి నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ కూడా అదే ప్రాంతంలో జరుగుతోంది.కృష్ణ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసిన వెంటనే చిరంజీవి కృష్ణను కలవాలని దొంగోడొచ్చాడు మూవీ సెట్ దగ్గరకు వెళ్లారు.
అయితే ఆ సమయంలో కృష్ణ పెద్ద డ్యాన్స్ మూమెంట్ చేయాల్సి ఉండటంతో డైరెక్టర్ కోడి రామకృష్ణ టెన్షన్ పడ్డారు.సాంగ్ షూటింగ్ సమయంలో చిరంజీవి ఉంటే కృష్ణ ఇబ్బంది పడతారేమో అని కోడి రామకృష్ణ టెన్షన్ పడ్డారు.చిరంజీవి కబుర్లు చెబుతూ టైమ్ పాస్ చేస్తుండటంతో కోడి రామకృష్ణకు టెన్షన్ మరింత పెరిగింది.అయితే షూటింగ్ ఎందుకు జరగడం లేదో అర్థం కాని కృష్ణ కోడి రామకృష్ణను షాట్ ఎందుకు తియ్యడం లేదని ప్రశ్నించారు.
ఆ తర్వాత కోడి రామకృష్ణ ఇబ్బంది కృష్ణకు అర్థమై షాట్ తీద్దామని కృష్ణ చెప్పడంతో పాటు కృష్ణ సింగిల్ టేక్ లో షాట్ ఓకే అయ్యేలా చేశారు.కృష్ణ పెద్ద డ్యాన్స్ మూమెంట్ ను అద్భుతంగా వేయడంతో షాకవ్వడం మెగాస్టార్ వంతైంది.చిరంజీవి కృష్ణతో మీ నమ్మకం నాకు నచ్చింది సార్ అని చెప్పడంతో పాటు పెద్ద మూమెంట్ ను ఎలాంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా వేశారంటూ ప్రశంసించారు.