జూ. ఎన్టీఆర్ కు ఫోన్ చేసిన చిరు.. తారక్ ఎలా ఉన్నారంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా పడినప్పటి నుంచి ఆయన అభిమానులు తెగ టెన్షన్ పడుతున్న సంగతి విదితమే.ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది.

 Megastar Chiranjeevi Call To Jr Ntr About Health Condition-TeluguStop.com

వృద్ధులతో పాటు సెకండ్ వేవ్ లో యువతీయువకుల్లో సైతం కరోనా వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.అయితే తాజాగా చిరంజీవి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కాల్ చేయడంతో పాటు ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తారక్ తో తాను కాసేపటి క్రితం మాట్లాడానని తెలిపారు.ప్రస్తుతం తారక్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్ లో ఉన్నారని చిరంజీవి పేర్కొన్నారు.

 Megastar Chiranjeevi Call To Jr Ntr About Health Condition-జూ. ఎన్టీఆర్ కు ఫోన్ చేసిన చిరు.. తారక్ ఎలా ఉన్నారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జూనియర్ ఎన్టీఆర్ తో పాటు అతని కుటుంబ సభ్యులు సైతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి పేర్కొన్నారు.ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉన్నారని చిరంజీవి వెల్లడించారు.

ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నాడని తెలిసి తాను చాలా సంతోషంగా ఉన్నానని మెగాస్టార్ పేర్కొన్నారు.

త్వరలోనే ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో కోలుకుంటాడని ఆశిస్తున్నానని చిరంజీవి తెలిపారు.చిరంజీవి ఇచ్చిన అప్ డేట్ తో తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.మరోవైపు ఎన్టీఆర్ పుట్టినరోజున ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో పాటు కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఉంటాయా.? ఉండవా.? ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 20వ తేదీన తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ప్రకటనలు ఉంటాయో లేదో చూడాల్సి ఉంది.ఎన్టీఆర్ 31వ సినిమా దర్శకుల జాబితాలో పలువురు స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి.

ఆ డైరెక్టర్లలో ఏ డైరెక్టర్ ఎన్టీఆర్ 31వ సినిమాకు దర్శకత్వం వహిస్తారో చూడాల్సి ఉంది.

#Ntr 31 St Movie #NTR Birthday #NtrCorona #NtrHome #Energitic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు