కూతురిపై ప్రేమతో ఆ పని చేస్తున్న మెగాస్టార్..!  

పదేళ్ల పాటు రాజకీయాల్లో బిజీగా ఉండి సినిమాలకు దూరమైన మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో వరుసగా సినిమాలకు కమిటవుతూ కెరీర్ విషయంలో జాగ్రత్త పడుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న చిరంజీవి ఈ సినిమా తరువాత లూసిఫర్, వేదాళం రీమేక్ లలో నటించనున్నారు.

TeluguStop.com - Megastar Chiranjeevi Buys Expensive Gift For His Daughter

సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు విడుదల కావాలనే ఉద్దేశంతో చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఒకవైపు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా చిరంజీవి కుటుంబానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవి చిన్నకూతురు శ్రీజకు ఖరీదైన బహుమతిని ఇవ్వనున్నారని తెలుస్తోంది.హైదరాబాద్ లో కాస్ట్లీ ఏరియాలలో ఒకటైన జూబ్లీహిల్స్ లో చిరంజీవి 1200 యార్డ్ ల స్థలాన్ని కొనుగోలు చేశారని.

TeluguStop.com - కూతురిపై ప్రేమతో ఆ పని చేస్తున్న మెగాస్టార్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ స్థలంలో భవంతి నిర్మాణం జరుగుతోందని.ఆ భవనాన్ని చిరంజీవి శ్రీజకు బహుమతిగా ఇవ్వనున్నారని సమాచారం.

చిరంజీవి కొడుకు, కూతుళ్లకు ఎప్పటికప్పుడు ఖరీదైన బహుమతులను ఇస్తూ తన ప్రేమను చాటుకుంటున్నారు.ఈ భవంతి కోసం చిరంజీవి ఐదు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.మరోవైపు చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ భాగం పూర్తి కాగా వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.మెగాస్టార్ కు జోడీగా కాజల్ ఈ సినిమాలో నటిస్తోంది.

ఆచార్య సినిమాలో చిరంజీవి దేవాదాయశాఖ అధికారితో పాటు నక్సలైట్ పాత్రను పోషిస్తున్నారని సమాచారం.రామ్ చరణ్ ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించనున్నారు.

కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో ఈ సినిమా కూడా చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మెగా అభిమానులు భావిస్తున్నారు.

#ExpensiveGift #Daughter Sreeja #HouseIn #Expensive Gift #5 Crores

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Megastar Chiranjeevi Buys Expensive Gift For His Daughter Related Telugu News,Photos/Pics,Images..