క్రేజీ అప్డేట్.. యూఎస్ లో మెగా 'భోళా శంకర్' భారీ రిలీజ్!

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు సక్సెస్ ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’.దర్శకుడు మెహర్ రమేష్( Meher Ramesh ) తెరకెక్కిస్తున్న ఈ మాస్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

 Megastar Chiranjeevi Bhola Shankar Release In Usa, Bhola Shankar, Megastar Chira-TeluguStop.com

ఈ సినిమాతో మెగాస్టార్ హ్యాట్రిక్ విజయం సాధించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

రీమేక్ అయినప్పటికీ చిరు వింటేజ్ లుక్ లో మరోసారి కనిపించడంతో మెగా ఫ్యాన్స్ అంచనాలు భారీగానే పెట్టుకున్నారు.ఇటీవలే ఈ సినిమా మ్యూజిక్ మ్యానియా స్టార్ట్ చేసారు.

మొదటి సాంగ్ ప్రోమో నిన్న రిలీజ్ అవ్వగా ఫుల్ సాంగ్ ను జూన్ 4న రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమా యూఎస్ లో భారీ రిలీజ్ కు సిద్ధం అవుతుందట.లాస్ట్ సెన్సేషనల్ హిట్ వాల్తేరు వీరయ్య తో మెగాస్టార్ యూఎస్ లో తన మ్యానియా బాగా చూపించడంతో భోళా శంకర్ కు కలిసి వస్తుంది.అందుకే ఈ సినిమా యూఎస్ లో ఏకంగా 600 కి పైగానే లొకేషన్స్ లో రిలీజ్ అవ్వనుంది అని టాక్ వస్తుంది.ప్రత్యంగిరా సినిమాస్ వారు యూఎస్ లో భోళా ను రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్( Keerthy Suresh ) చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కీలక రోల్ లో నటిస్తుండగా.ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube