పోకిరి సినిమా వెనుక మెగాస్టార్ ఉన్నాడన్నా సంగతి తెలుసా?

Megastar Chiranjeevi Behind Pokiri Movie

2006లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పోకిరి సినిమా ఎంత సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.మహేష్ బాబు, ఇలియానా కలిసి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకొని రికార్డుకెక్కింది.

 Megastar Chiranjeevi Behind Pokiri Movie-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, ఆలీ, నాజర్ వంటి పలువురు నటీ నటులు నటించారు.

సినిమాలోని డైలాగులు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

 Megastar Chiranjeevi Behind Pokiri Movie-పోకిరి సినిమా వెనుక మెగాస్టార్ ఉన్నాడన్నా సంగతి తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో పాటలు కూడా ఎంతో మంచి సక్సెస్ ను అందుకున్నాయి.ఇక ఈ సినిమా తెలుగులో హిట్ అవడంతో తమిళంలో 2007లో పోకిరి అనే పేరుతో రీమేక్ చేశారు.

హిందీలో వాంటెడ్ అనే టైటిల్ తో విడుదలయింది.కన్నడ భాషలో పోర్కి, బెంగాలీలో రాజోట్టో పేర్ల తో రీమేక్ చేశారు.

అక్కడ కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడట.

అదేంటి మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా వెనకాల ఉండటం ఏంటి అని అనుకుంటున్నారా.అవును మీరు విన్నది నిజమే ఈ సినిమా కథ అచ్చం చిరంజీవి నటించిన కథలాగే ఉందట.ఇంతకు అది ఏ సినిమా అంటే.1988లో బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన స్టేట్ రౌడీ సినిమా.సినిమాలో చిరంజీవి, రాధా నటీనటులుగా నటించారు.ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.ఇందులో పాటలు, చిరంజీవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇందులో భానుప్రియ కూడా హీరోయిన్ గా నటించింది.రావు గోపాల్, నూతన్ ప్రసాద్, త్యాగరాజన్ ఆంటీ పలువురు నటీనటులు నటించారు.

ఇక ఈ సినిమా కథ కూడా అచ్చం పోకిరి సినిమా లాగే ఉంది.నిజానికి ఈ సినిమా కథనే పోకిరి సినిమాగా తెరకెక్కించారు.పోకిరి సినిమాలో మహేష్ బాబు అండర్ కవర్ పోలీస్ గా ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా పోకిరి గా తిరుగుతూ చివరికి క్లైమాక్స్ లో పోలీస్ అని ట్విస్ట్ ఇవ్వగా.ఈ క్లైమాక్స్ మాత్రం బాగా అదిరిపోయింది.

ఇక చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమా కూడా అండర్ కవర్ పోలీస్ గా తెరకెక్కింది.ఇందులో చిరంజీవి కూడా అండర్ కవర్ పోలీస్ గా ఉంటూ ఏమాత్రం అనుమానం రాకుండా రౌడీ గా నటించి చివరికి పోలీస్ అని ట్విస్ట్ ఇవ్వటంతో ఈ సీన్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అంతేకాకుండా స్టేట్ రౌడీ లో, పోకిరి లో పాత్రలు కూడా చాలా వరకు ఒకేలా ఉన్నాయి.అలా అప్పుడు స్టేట్ రౌడీ తో చిరంజీవి, పోకిరి తో మహేష్ బాబు తమ ఖాతాలో మంచి సక్సెస్ ను నింపుకున్నారు.

ఇప్పటికీ ఈ సినిమాలు బుల్లితెరపై ప్రసారం అవుతే మాత్రం ప్రేక్షకులు అస్సలు మిస్ అవ్వరు.

#Mahesh Babu #Secret Pokiri #Role #Chiranjeevi #Pokiri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube