చరణ్ ను బెల్ట్ తో కొట్టిన చిరంజీవి.. కారణమేమిటంటే..?

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తండ్రీకొడుకులు కావడంతో పాటు సినిమాల్లో స్టార్ హీరోలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.రామ్ చరణ్ స్టార్ హీరోగా ఎదగడంలో చిరంజీవి పాత్ర ఎంతో ఉంది.

 Megastar Chiranjeevi Beats Ram Charan With Belet Just Because Of Nagababu,latest-TeluguStop.com

మరోవైపు చరణ్ తండ్రి చిరంజీవితో సినిమాలను నిర్మిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.అయితే చిరంజీవి రామ్ చరణ్ ను ఒక సందర్భంలో బెల్ట్ తో కొట్టారు.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఘటన నిజంగా జరిగింది.

తండ్రి చిరంజీవి ఒకే ఒక సందర్భంలో తనపై కోపాన్ని ప్రదర్శించడంతో పాటు బెల్ట్ తో కొట్టాడని బాబాయ్ నాగబాబు వల్లే ఈ ఘటన జరిగిందని చరణ్ అన్నారు.

దాదాపు 25 సంవత్సరాల క్రితం ఇంటి గేటు దగ్గర సెక్యూరిటీ, డ్రైవర్ ఏమో మాట్లాడుకుంటున్నారని వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలు తనకు అర్థం కాలేదని చరణ్ చెప్పారు.ఆ సమయంలో వాళ్లు మాట్లాడే మాటల గురించి బాబాయ్ నాగబాబును అడిగానని చరణ్ పేర్కొన్నారు.

Telugu Ram Charan, Story, Chiranjeevi, Nagababu-Movie

ఆ సమయంలో నాగబాబు చరణ్ బూతులు నేర్చుకోవడంతో పాటు ఆ బూతులకు అర్థం ఏమిటని తననే అడుగుతున్నాడని చిరంజీవికి ఫిర్యాదు చేశారు.ఆ విషయం తెలిసి చిరంజీవి కోపంతో బెల్ట్ తో చరణ్ ను కొట్టారు.అయితే ఆ తరువాత చిరంజీవి చరణ్ ను ప్రేమతో దగ్గరకు తీసుకుని అలాంటి మాటలు నేర్చుకోకూడదని, మాట్లాడకూడదని సూచనలు చేశారు.

అయితే బాబాయ్ వల్లే చిరంజీవి కొట్టారని భావించిన చరణ్ కొన్నిరోజుల పాటు నాగబాబుతో కూడా మాట్లాడలేదని సమాచారం.

అయితే ఆ ఘటన తర్వాత నాన్న నన్ను ఎప్పుడూ కొట్టలేదని చరణ్ ఒక సందర్భంలో వెల్లడించారు.ప్రస్తుతం ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube