ఒకే వారంలో రాబోతున్న చిరు, బాలయ్య  

Megastar Chiranjeevi and Balakrishna Box office fight again , Chiranjeevi, Acharya Movie, balakrishna, balayya-boyapati combo, - Telugu Acharya, Balakrishna, Boyapata, Chiranjeevi, Koratala Shiva

కరోనా కారణంగా ఈ ఏడాది విడుదల కావాల్సిన పలు సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.ఇప్పటికే విడుదల అవ్వాల్సిన సినిమాలు ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నాయి.

TeluguStop.com - Megastar Chiranjeevi And Balakrishna Box Office Fight Again

దసరాకి అనుకున్న సినిమాలను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని భావిస్తున్నారు.ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో విడుదల అవ్వాల్సిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయాలని దర్శకుడు కొరటాల శివ నిర్ణయించుకున్నారు.
ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ని పునః ప్రారంభించేందుకు చిరంజీవి రెడీ అవుతున్నట్లు గా తెలుస్తోంది.మెగాస్టార్ కొరటాల కాంబో లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా కూడా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.అది కూడా ఏప్రిల్ చివరి వారంలోనే విడుదల కాబోతుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

TeluguStop.com - ఒకే వారంలో రాబోతున్న చిరు, బాలయ్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే సగం వరకు పూర్తి అయింది.అతి త్వరలో బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేయనున్నారు.
బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.భారీ అంచనాలు ఉన్న రెండు పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఒకే వారంలో రాబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద పోటీ చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

గతంలో చిరంజీవి బాలకృష్ణలు చాలాసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు.చివరగా వీరిద్దరు 2017 లో ఖైదీ నెం.150 మరియు గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందర్బంగా పోటీ పడ్డారు.ఆ పోరులో చిరంజీవిది పై చేయి అయ్యింది.

అయితే ఈసారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి.

#Balakrishna #Boyapata #Koratala Shiva #Chiranjeevi #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Megastar Chiranjeevi And Balakrishna Box Office Fight Again Related Telugu News,Photos/Pics,Images..