పవన్ 'కాపు ' జపం వెనక 'మెగా ' ప్లాన్  ?

కులాలకు, మతాలకు అతీతంగా రాజకీయం చేస్తానని , జనసేన సిద్ధాంతం కూడా అదే అంటూ పార్టీ పెట్టినప్పటి నుంచి చెప్పుకుంటూ పోస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.దానికి తగ్గట్టుగానే రాజకీయం చేసుకుంటూ వచ్చారు.

 Megastar Chiranjeevi Advise On Pawan Kalyan About Kapu Community Issue, Janasena-TeluguStop.com

తన సొంత నియోజకవర్గమైన కాపుల విషయంలో అంటీ ముట్టనట్లు గా ఆయన వ్యవహరిస్తూ వచ్చారు.కాపులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం ద్వారా, జనసేన పై కాపు ముద్ర పడుతుందని, రాజకీయంగా విమర్శలు వస్తాయని నమ్ముతూ వచ్చారు.

కానీ అకస్మాత్తుగా ఆయన కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తున్నారు.తాజాగా కాపు సామాజికవర్గం ఏర్పాటు చేసుకున్న సమావేశానికి వెళ్లిన పవన్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాపులు ఎప్పటి నుంచో రాజకీయంగా నిరాదరణకు గురి అవుతున్నారని , అన్ని రంగాల్లోనూ వెనుకబడ్డారు అని, ప్రతి రాజకీయ పార్టీ కాపులను ఓటు బ్యాంక్ కోణంలోనే చూస్తోంది తప్ప , వారి అభివృద్ధికి కృషి చేయడం లేదని,  ఇకపై కాపులకు అన్ని విధాలుగా తాను అండగా నిలుస్తానని, జనసేన ఎప్పుడు వారికి అండదండలు అందిస్తుందని పవన్ గొప్పగా ప్రకటించారు.దీంతో ఒక్కసారిగా రాజకీయ కలకలం రేగింది.

జనసేన పార్టీని స్థాపించి దాదాపు ఎనిమిది ఏళ్ళు అవుతున్నా, పవన్ ఎప్పుడూ కాపు జపం చేయలేదు.కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ఓపెన్ అయి పోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ,అల్లు అరవింద్, నాగబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారని, ఈ సందర్భంగా మొదటిసారిగా జనసేన కు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చిందని, ఈ సందర్భంగా చిరంజీవి జనసేన కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.ఏపీలో ప్రధాన సామాజిక వర్గం గా ఉన్నారని, వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం జనసేన కు రాజకీయ ఇబ్బందులు తెచ్చిపెడతాయి అని చిరంజీవి పవన్ కు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

Telugu Allu Arvind, Chiranjivi, Janasen, Kapu, Nagababu, Pavan Kalyan, Ysrcp-Tel

వైసిపికి రెడ్ల బలం, తెలుగుదేశం పార్టీకి కమ్మల బలం ఉందని , జనసేన కు కాపుల బలం ఉంటే తప్పేంటని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పినట్లు తెలుస్తోంది.కాపులను ఏక తాటిపైకి తెచ్చి ముందుకు వెళ్తేనే రాజకీయ ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని చిరంజీవి పవన్ కు హిత బోధ చేశారట.అందుకే పవన్ సైతం ఒక్కసారిగా కాపు ల విషయంలో ఓపెన్ అయిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube