తండ్రితో కలిసి మెగాస్టార్ నటించిన సినిమా ఏదో తెలుసా?  

తెలుగు ఇండస్ట్రీలో తన నటనతో ఆకట్టుకొని మెగాస్టార్ అనే పేరును సంపాదించుకున్నారు.చిరంజీవి ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రలలో నటించారని మనకు తెలుసు.

TeluguStop.com - Megastar Chiranjeevi Acted With His Father In Jagath Kiladi Film

ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు తగ్గట్టు న్యాయం చేస్తారు.ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి విజయాలను అందుకున్న చిరంజీవి కోసం దర్శక నిర్మాతలు ఆయన ముందు క్యూ కట్టే వారు.

ఇలా చిరంజీవి తన సినీ జీవితంలో దాదాపు 150 చిత్రాలకు పైగా నటించారు.అంతేకాకుండా చిరంజీవి తన సినిమాలలో తన కుటుంబ సభ్యులతో కూడా నటించారు.

TeluguStop.com - తండ్రితో కలిసి మెగాస్టార్ నటించిన సినిమా ఏదో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.చిరంజీవి రామ్ చరణ్ తో కలిసి ఖైదీ నెంబర్ 150, బ్రూస్ లీ, వంటి సినిమాలలో తన కొడుకుతో కలిసి వెండితెరను పంచుకున్నారు.

అంతేకాకుండా తన తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ ,నాగబాబు లతో కలిసి నటించారు.వీరు మాత్రమే కాకుండా తన అల్లుళ్ళు, బామ్మర్దిలతో కూడా సినిమాలలో కనిపించిన సంగతి మనకు తెలిసినదే.

కాకపోతే ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే చిరంజీవి సినిమాలలో తన తండ్రి వెంకట్రావుతో కలిసి నటించారని బహుశాఎవరికీ తెలియకపోవచ్చు.

చిరంజీవి తండ్రి వెంకట్రావు గారికి నటనపై ఎంతో ఆసక్తి ఉండడంతో చిరంజీవి గారితో కలిసి వెండితెరను పంచుకున్నారు.

అప్పట్లో చిరంజీవి నటించిన “జగత్ కిలాడీలు“అనే చిత్రంలో చిరంజీవితో కలిసి నటించారు.ఆ తరువాత కుటుంబ బాధ్యతల నేపథ్యంలోనూ, వెంకట్రావు సినిమాలకు దూరంగా ఉన్నారు.

చిరంజీవి తరహాలోనే బాలకృష్ణ, నాగార్జున వంటి ప్రముఖ హీరోలు కూడా వారి తండ్రితో కలిసి నటించిన సినిమాలు మనకు తెలిసినవే.ఇలా తమ తండ్రితో, తమ వారసులతో కలిసి వెండితెరపై తళుకుమన్న హీరోలు కూడా ఉన్నారు.

ఇలా ప్రముఖ హీరోలు అందరూ ఒకే సినిమాలో ఒకే తెరపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

#Jagath Kiladilu #TeluguFilm #Venkat Rao #Father Film

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Megastar Chiranjeevi Acted With His Father In Jagath Kiladi Film Related Telugu News,Photos/Pics,Images..