మీకు తెలుసా : మెగాస్టార్ చిరంజీవి ఆ సీరియల్ లో నటించాడు...

ఎలాంటి సినిమా కుటుంబం బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకుని ఎంతోమంది నేటితరం నటీనటులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న టాలీవుడ్ “మెగాస్టార్ చిరంజీవి” గురించి సౌతిండియాలోని తెలియనివారుండరు.అయితే మెగాస్టార్ చిరంజీవి కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయవేత్తగా, విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేపట్టాడు.

 Megastar Chiranjeevi Acted In Hindi Serial, Megastar, Chiranjeevi, Hindi Serial,-TeluguStop.com

ఇందులో భాగంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంక్ వంటి ట్రస్టుల ద్వారా ఎంతో మందికి రక్త దానం, చూపు దానం చేస్తున్నాడు.అయితే సినిమాల్లోకి రాకముందు మెగాస్టార్ చిరంజీవి చెన్నైలోని మద్రాసులో నటనకి సంబంధించిన కోర్సులను చేసాడు.

అయితే ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో హీరోగా నటించాడని మాత్రమే అందరికీ తెలుసు.కానీ మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ లోని ఓ హిందీ సీరియల్ లో నటించాడని చాలా మందికి తెలియదు.

అయితే మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో “రజిని” అనే ధారావాహిక లో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటించాడు.అది కూడా కేవలం ఒక్క ఎపిసోడ్ లో మాత్రమే నటించాడు.

అయితే ఈ ధారావాహిక దూరదర్శన్ ఛానల్ లో ప్రసారమయ్యేది.ఆ తర్వాత చిరంజీవి పలు బాలీవుడ్ చిత్రాల్లో అవకాశం రావడంతో సీరియల్ కి గుడ్ బై చెప్పి పూర్తిగా సినిమాల వైపు దృష్టి సారించాడు.

దీంతో మొదటగా “పునాది రాళ్లు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు.

Telugu Chiranjeevi, Hindi Serial, Rajini, Tollywood-Movie

అయితే మొదట్లో మెగాస్టార్ చిరంజీవి పలు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో కూడా నటించాడు.కానీ క్రమక్రమంగా నటన పరంగా ఎన్నో మెళుకువలను మెరుగు పరుచుకుని హీరోగా సక్సెస్ అయ్యాడు.దీంతో కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 150కి పైగా చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube