ఫిబ్రవరి 4న ఆచార్య.. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆచార్య.మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ నటిస్తుంది.

 Megastar Chiranjeevi Acharya Official Release Date , Megastar , Aharya , Relesed-TeluguStop.com

సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.సినిమాలో చరణ్ రోల్ చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది.

చరణ్ కు జోడీగా పూజా హెగ్దే నటించింది.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇన్నాళ్లు ఉన్న కన్ ఫ్యూజన్ ను తొలగిస్తూ రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్రయూనిట్.

డిసెంబర్, జనవరి ఇలా రకరకాల డేట్స్ వినపడగా.ఫైనల్ గా ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్ ఫిక్స్ చేశారు.చిరు ఆచార్య సినిమా ఫిబ్రవరి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది.2022 సక్రాంతి నుండి వరుస సినిమాలు రిలీజ్ ప్లాన్ చేశారు.2022 జనవరి 7న ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతికి ప్రభాస్ రాధే శ్యాం, మహేష్ సర్కారు వారి పాట, పవన్ భీమ్లా నాయక్ లు రిలీజ్ ఫిక్స్ చేశారు.ఫిబ్రవరి 4న చిరు ఆచార్య రిలీజ్ ప్లాన్ చేశారు.

  చిరు, చరన్ ఇద్దరు కలిసి నటించిన ఈ ఆచార్య సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.మెగా ఫ్యాన్స్ ను తప్పకుండా ఈ సినిమా సూపర్ ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube