మెగాస్టార్ పిలుపు అందుకున్న కొరటాల.. అందుకేనట !

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ఆచార్య.ఇది చిరంజీవి 152 వ సినిమా గా తెరకెక్కుతుంది.

 Megastar Chiranjeevi Acharya Movie Shooting Update-TeluguStop.com

కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కి స్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా సిద్ద అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.

 Megastar Chiranjeevi Acharya Movie Shooting Update-మెగాస్టార్ పిలుపు అందుకున్న కొరటాల.. అందుకేనట -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా సిద్ద అనే పేరుతో విద్యార్థి సంఘానికి నాయకుడిగా నటిస్తున్నాడు.

రామ్ చరణ్, పూజ ఈ సినిమాలో కొద్దీ సేపే కనిపించ బోతున్నప్పటికీ వీళ్ళ పాత్రలు సినిమాకే హైలెట్ గా ఉండబోతున్నాయని సమాచారం.ఈ సినిమాలో విలన్ గా సోనూసూద్ నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమాలో చిరంజీవి దేవాలయాలు మరియు అనేక మాతపరమైన కార్యకలాపాలకు సంభందించిన విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు.ఈ సినిమాను కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకం పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా నుండి టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని అంచనాలను పెంచేసాయి.

Telugu Acharya, Chiranjeevi, Kajal Agarwal, Koratala Shiva, Megastar Chiranjeevi Acharya Movie Shooting Update, Pooja Hegde, Ram Charan-Movie

అయితే ఈ సినిమా షూటింగ్ మరికొద్ది భాగం మాత్రమే బాలన్స్ ఉంది.మరొక 15 రోజులు షూటింగ్ చేస్తే ఈ మూవీ పూర్తి అవుతుంది.ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండడంతో మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు.ఆచార్య కూడా త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని మెగాస్టార్ కొరటాలకు కబురు చేశారట.

తొందరగా పూర్తి చేసి విడుదల చేయాలనీ మెగాస్టార్ కొరటాలకు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది.

#Kajal Agarwal #Chiranjeevi #Koratala Shiva #Ram Charan #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు