'అద్బుతం' అంటూ అభినందించిన మెగాస్టార్‌ చిరంజీవి

Megastar Chiranjeevi About Teja Sajja Adbutam Movie

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా లో నేనున్నా నాయనమ్మ అంటూ డైలాగ్ చెప్పి వచ్చే బుడ్డి ఇంద్ర సేనా రెడ్డి ఇప్పుడు హీరోగా మారాడు.అతడే తేజ సజ్జా.

 Megastar Chiranjeevi About Teja Sajja Adbutam Movie-TeluguStop.com

వరుసగా సినిమాలు చేస్తున్న తేజ సజ్జా తాజాగా అద్బుతం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్ తో ఈ సినిమా ను రూపొందించారు.

చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌ కావడంతో పాటు మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా టాక్ దక్కింది.భారీ ఎత్తున అంచనాలున్న అద్బుతం ను థియేటర్ రిలీజ్‌ ను స్కిప్ చేసి ఓటీటీ రిలీజ్ కు సిద్దం చేయడం జరిగింది.

 Megastar Chiranjeevi About Teja Sajja Adbutam Movie-అద్బుతం’ అంటూ అభినందించిన మెగాస్టార్‌ చిరంజీవి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓటీటీ లో ఈ సినిమా ను భారీ ఎత్తున చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా గురించి మెగా స్టార్ చిరంజీవి స్పందించాడు.

సినిమా ను చూశాను అంటూ చిరంజీవి పేర్కొన్నాడు.

సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పిన మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో హీరో హీరోయిన్ గా నటించిన తేజ సజ్జ మరియు శివాని రాజశేఖర్‌ లను అభినందించాడు.ఇద్దరు కూడా ది బెస్ట్‌ ఇచ్చారంటూ ప్రశంసలు కురిపించాడు.మంచి కథతో రూపొందిన ఈ సినిమా ను ప్రతి ఒక్కరు చూడవచ్చు అంటూ ఆయన పేర్కొన్నాడు.

సినిమా ఖచ్చితంగా ఒక మంచి సినిమా గా నిలుస్తుందని మొదటి నుండే మేకర్స్‌ చెబుతూ వచ్చారు.వారు అన్నట్లుగానే చెప్పినట్లుగానే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

చిరంజీవి వంటి మెగాస్టార్ ఈ సినిమాను ప్రశంసించడం నిజంగా గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు.ఈ సినిమా అద్బుతం అంటూ నెటిజన్స్ కూడా కితాబిస్తున్నారు.

ప్లే బ్యాక్ అనే సినిమా అచ్చు ఈ సినిమా మాదిరిగానే ఉంటుంది.కాన్సెప్ట్‌ సేమ్‌ అయినా కూడా చూపించిన విధానం వేరుగా ఉండటంతో ఆ సినిమా చూసిన వారు కూడా ఈ సినిమాను అభినందిస్తున్నారు.

#Teja Sajja #Adbutam #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube