మెగా ఫ్యాన్స్‌కు వచ్చే ఏడాది ఢబుల్‌ ధమాకానా?  

Megastar Acharya Lucifer Remake Next Year - Telugu Acharya, Chiranjeevi, Chiranjeevi To Release Two Movies At A Time, Lucifer Remake, Mega Star, Saahoo, Sankranthi

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య షూటింగ్‌ కరోనా కారణంగా మద్యలో ఆగింది.ప్రస్తుతానికి షూటింగ్స్‌కు అనుమతులు ఇస్తున్నా కూడా ఆగస్టు నుండి సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవ్వాలనే నిర్ణయానికి వచ్చాడు.

 Megastar Acharya Lucifer Remake Next Year

ఇదే సమయంలో చిరంజీవి లూసీఫర్‌ రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేయించినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన డైలాగ్‌ వర్షన్‌ రాస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

సాయి మాధవ్‌ బుర్రా ప్రస్తుతం సినిమాకు డైలాగ్స్‌ రాస్తున్నాడట.

మెగా ఫ్యాన్స్‌కు వచ్చే ఏడాది ఢబుల్‌ ధమాకానా-Movie-Telugu Tollywood Photo Image

ఈ ఏడాది చివర్లో లూసీఫర్‌ రీమేక్‌ను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లేలా చర్యలు జరుగుతున్నాయి.

ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది.సినిమాను కేవలం మూడు నుండి నాలుగు నెలల్లో పూర్తి చేసే అవకాశం ఉంది.

కనుక వచ్చే ఏడాది సమ్మర్‌ లేదా దసరాకే సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మెగా వర్గాల వారు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు దర్శకుడు సుజీత్‌ చేస్తున్నాడు.

సాహో చిత్రాన్ని చాలా కాలం తెరకెక్కించిన సుజీత్‌ లూసీఫర్‌ రీమేక్‌కు అతి తక్కువ సమయంలో పూర్తి చేసి తన సత్తా ఏంటో నిరూపించుకునే ఉద్దేశ్యంతో ఉన్నాడు.ఆచార్య చిత్రం అంతా సవ్యంగా ఉంటే వచ్చే ఏడాది ఆరంభంలోనే అంటే సంక్రాంతికే విడుదల అయ్యే అవకాశం ఉంది.ఇక లూసీఫర్‌ చిత్రం మళ్లీ అదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.అంటే వచ్చే ఏడాది రెండు సినిమాలతో మెగాస్టార్‌ ప్రేక్షకులను రంజింప చేయనున్నాడన్నమాట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Megastar Acharya Lucifer Remake Next Year Related Telugu News,Photos/Pics,Images..

footer-test