పదో తరగతిలోనే లెటర్.. నిహారిక సీక్రెట్స్ చెప్పేసిన నాగబాబు..!

మెగాబ్రదర్, ప్రముఖ నిర్మాత నాగబాబుకు కూతురు నిహారిక అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నాగబాబు జడ్జిగా వ్యవహరించే పలు షోలలో అప్పుడప్పుడూ నిహారిక గెస్ట్ గా హాజరై సందడి చేస్తూ ఉంటారు.

 Mega Brother Nagababu Says About His Daughter Communication Skills, Mega Brother-TeluguStop.com

నాగబాబు నిహారిక గురించి చాలా సందర్భాల్లో కూతురు అంటే ఎంత ప్రేమో చెప్పడంతో పాటు కూతురు చేసిన తుంటరి పనులను కూడా చెప్పుకొచ్చారు.తాజాగా నాగబాబు యూట్యూబ్ ఛానల్ “మన ఛానల్ మన ఇష్టం” లో తల్లిదండ్రులు పిల్లలతో ఏ విధంగా ఉండాలో చెబుతూ నిహారిక గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తల్లిదండ్రులు పిల్లలకు ఏ విషయం గురించైనా చెప్పే స్వేచ్ఛ, స్వాతంత్రం ఇవ్వాలని నాగబాబు పేర్కొన్నారు.చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లలపై విపరీతమైన ప్రేమ ఉంటుందని ఆ ప్రేమ వల్ల పిల్లలకు ఇవ్వాల్సిన ఫ్రీడం ఇవ్వరని చెప్పారు.

నిహారిక స్కూల్ లో చదువుకునే రోజుల్లో ఉత్తరాంచల్ కు టీచర్లు, స్నేహితులు టూర్ వేశారని ఆ సమయంలో కూతురు టూర్ కు వెళ్లడానికి మొండిపట్టు పట్టి ఏ విధంగా ఒప్పించిందో నాగబాబు చెప్పుకొచ్చారు.

Telugu Class, Nagababuyoutube, Niharika, Uttaranchal-Latest News - Telugu

నిహారిక పదో తరగతి చదువుతున్న సమయంలో పది రోజులు టూర్ కు వెళతానంటే తాను చాలా భయపడ్డానని.టూర్ కు వెళ్లడానికి ఒప్పుకోనని తేల్చి చెప్పానని పేర్కొన్నారు.కొన్ని రోజుల పాటు తనను నిహారిక బ్రతిమాలినా తాను అంగీకరించలేదని అన్నారు.

చివరకు బాడీగార్డ్స్ ను పంపిస్తానని నిహారికతో చెప్పగా కూతురు అందుకు అంగీకరించలేదని తెలిపారు.
ఆ తరువాత రోజు ఒక లెటర్ ఉందని ఆ లెటర్ లో నిహారిక తన టీచర్ల ఫోన్ నంబర్లు, స్నేహితుల ఫోన్లు అన్నీ ఇస్తానని.

ఎక్కడికి వెళ్లినా లొకేషన్ చెబుతూ రోజుకు కనీసం మూడుసార్లు ఫోన్ చేస్తానని.సిగ్నల్ లేకపోయినా ఎలాగోలా సమాచారం చేరవేస్తానని.

లొకేషన్ కు సంబంధించిన వివరాలను పంచుకుంటానని పేర్కొందని అలా అడగడంతో తాను టూర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని నిహారిక సీక్రెట్లను నాగబాబు పంచుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube