చిరు టైటిల్ కార్తికేయకి కలిసి వస్తుందా..!

ఆరెక్స్ 100 హీరో కార్తికేయ తన కొత్త సినిమా అప్డేట్ తో సర్ ప్రైజ్ చేశాడు. సరిపల్లి శ్రీ డైరక్షన్ లో రాజా విక్రమార్క టైటిల్ తో వస్తున్నాడు కార్తికేయ.

 Mega Title Raja Vikramarka Makes Luck For Karthikeya-TeluguStop.com

అయితే ఈ టైటిల్ లో ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఈ టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేశారు.రవిరాజా పినిశెట్టి డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాజా విక్రమార్క సినిమా వచ్చింది.

ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఇప్పుడు అదే టైటిల్ తో కార్తికేయ వస్తున్నాడు.

 Mega Title Raja Vikramarka Makes Luck For Karthikeya-చిరు టైటిల్ కార్తికేయకి కలిసి వస్తుందా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కెరియర్ లో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ ఈసారి మెగా టైటిల్ తో తన లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు.

Telugu Karthikeya, Luck, Mega Title, Movie News, Raja Vikramarka, Rx 100 Karthikeya, Rx Karthikeya, Sri Saripalli, Tollywood-Movie

చిరు టైటిల్ రాజా విక్రమార్క టైటిల్ తో వస్తున్న కార్తికేయ హిట్ టార్గెట్ తో వస్తున్నాడు.సినిమా కథ, కథనం కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది.టైటిల్ పోస్టర్ తో షాక్ ఇచ్చిన కార్తికేయ జోష్ చూస్తుంటే ఈ సినిమాతో హిట్ అందుకునేలా ఉన్నాడు.

లాస్ట్ సినిమా చావు కబురు చల్లగా నిరాశపరచడంతో ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు కార్తికేయ.ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.

మంచి ఫిజిక్, భారీ కటౌట్ ఉన్న కార్తికేయ యాక్షన్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు.హీరోగానే కాదు నాని గ్యాంగ్ లీడర్ విలన్ గా కూడా మెప్పించిన కార్తికేయ ఎలాగైనా సరే సత్తా చాటాలని చూస్తున్నాడు.

#Karthikeya #Luck #Raja Vikramarka #Sri Saripalli #Rx Karthikeya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు