టచ్ లోనే ఉన్నాం: జగన్ తో భేటీ పై చిరు సంచలన వ్యాఖ్యలు

మెగా స్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జగన్ లు ఇద్దరూ సతీ సమేతంగా భేటీ అవ్వడం, అనేక అంశాలను గురించి చర్చించుకోవడం ఇప్పుడు ఏపీలో హాట్ న్యూస్ గా మారింది.అసలు వీరిద్దరి భేటీ ఉంటుంది అనే వార్త బయటకి వచ్చినప్పటి నుంచే ఎవరికి వారు తమకు నచ్చినట్టుగా ఊహించుకుని చేయాల్సినంత హడావుడి చేశారు.

 Mega Star Chiranjivi Comments On Ap Cm Jagan Mohan Reddy-TeluguStop.com

ఏదైతేనేమి వారి మధ్య భట్ అయితే జరిగిపోయింది కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంబాషణపై ఇప్పుడు అనేక గాసిప్స్ బయటకి వస్తున్నాయి.సైరా సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో షోల సంఖ్యను పెంచుకునేందుకు తగిన అనుమతులు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పేందుకే చిరు వెళ్తున్నారని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.

ఇదే సమయంలో మెగా ఫ్యాన్స్ మధ్య స్పష్టమైన విభజన కనిపించింది.ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ చిరంజీవి తీరుపై మండిపడుతూనే ఉన్నారు.

Telugu Ap Cm, Chiranjivi, Chiranjiviap, Pawankalayan, Pawankalyan-Telugu Politic

  ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టిన నాలుగు నెలల తరువాత మెగా స్టార్ చిరంజీవి మొదటిసారిగా ఆయనతో భేటీ అవుతున్నారని జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని స్వయంగా చిరంజీవే క్లారిటీ ఇచ్చేసాడు.జగన్ తో తాను రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నానని, తరచూ తామిద్దరం మాట్లాడుకుంటున్నామని చిరంజీవి చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు.వాస్తవానికి పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వానికి వందరోజుల గడువు ఇచ్చారు.అది పూర్తి కాగానే విమర్శల వర్షం కూడా కురిపించడం మొదలుపెట్టారు.పవన్ చంద్రబాబుకు అనుకూలం, జగన్ కు వ్యతిరేకం అనే అభిప్రాయం అందరిలోనూ కలిగింది.ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి జగన్ ను కలవడంతో పాటు తామిద్దరం రెగ్యులర్ గా మాట్లాడుకుంటూనే ఉన్నాం అని చెప్పడం ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కి అంతుబట్టని విషయంగా మారిపోయింది.

Telugu Ap Cm, Chiranjivi, Chiranjiviap, Pawankalayan, Pawankalyan-Telugu Politic

  ఒకవైపు తమ్ముడు జనసేన పార్టీ స్థాపించి సీఎం పీఠం కోసం ఆరాటపడుతూ జగన్ మీద విమర్శలు చేస్తుంటే అన్న మాత్రం జగన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్టు చెప్పి నిజంగా పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు.అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే జగన్ తో భేటీ అయ్యే ముందు తాను ఎందుకు కలవబోతున్నానో అన్న విషయం పవన్ కు చిరు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.ఈ భేటీకి సంబందించిన వ్యవహారం మొత్తం చూస్తే జనసేనాని ఒంటరివాడయినట్టే కనిపిస్తోంది.ఇది ఖచ్చితంగా జనసేన రాజకీయ ఎదుగుదలపై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube