చిరు తమన్నా సింహాద్రికే తెలిసిన ఆ సీక్రెట్‌ ఏంటో మాకు తెలుసు

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ఫైనల్‌ ఎపిసోడ్‌లో చిరంజీవి స్పెషల్‌ గెస్ట్‌గా హాజరు అయ్యారు.ఆయన రాకతో బిగ్‌బాస్‌ స్టేజ్‌ అంతా సందడిగా కనిపించింది.

 Mega Star Chiranjeevi Praise Tamanna-TeluguStop.com

చిరంజీవి ఉన్నంత సేపు చాలా సరదాగా షో సాగింది.ఫైనల్‌కు మాంచి గెస్ట్‌ను తీసుకు వచ్చారంటూ అంతా నిర్వాహకులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక చిరంజీవి రాగానే ఇంటి సభ్యులను హోస్ట్‌ నాగార్జున పరిచయం చేయడం జరిగింది.ఆ పరిచయ కార్యక్రమం చాలా విభిన్నంగా, చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగింది.

Telugu Chiranjeevi, Telugu Big Boss-

పునర్నవి అంటూ చిరంజీవి అనగా ఆమెను పునర్నవి గారు అంటూ పిలవాలంటూ సూచించాడు.అప్పుడు చిరంజీవి పునర్నవి గారు అంటూ చిరంజీవి పిలవడం అందరికి నవ్వు తెప్పించింది.హేమ విషయంలో కూడా చిరంజీవి చేసిన కామెంట్స్‌ నవ్వు తెప్పించాయి.ఐలవ్‌యు అంటూ రోహిణి చెప్పగా చిరంజీవి మెలికలు తిరిగి పోయి సిగ్గు పడటం కూడా ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేశారు.

బాబా భాస్కర్‌ బాగా నటించాడు అంటూ కామెంట్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Telugu Chiranjeevi, Telugu Big Boss-

ఇక చివరగా తమన్నా విషయంలో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నీ అనుకున్న వారు చెడు దారిలో వెళ్తుంటే వారిని హెచ్చరించడం, నీ డేరింగ్‌ మరియు నీ డ్యాషింగ్‌ నాకు నచ్చుతాయి అంటూ చిరంజీవి ఆమెను ప్రశంసించారు.మంచి వారిని చెడు చేసేందుకు ప్రయత్నించిన వారికి నీవు దూరంగా ఉండటం అభినందనీయం అంటూ తమన్నాతో అన్నాడు.

Telugu Chiranjeevi, Telugu Big Boss-

ఈ విషయం నీకు నాకు మాత్రమే అర్థం అవుతాయి.ఎవరికి అర్థం కాదు అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు.అయితే అసలు విషయం ఏంటీ అంలే శ్రీరెడ్డికి మొదట తమన్నా సింహాద్రీ సపోర్ట్‌ చేసింది.కాని ఎప్పుడైతే శ్రీరెడ్డి మాటలు శృతిమించి పవన్‌ను వ్యతిరేకించిందో అప్పుడే తమన్నా ఆమెను వ్యతిరేకించింది.

అందుకే తమన్నాను చిరంజీవి అభినందించారు.చిరంజీవి మాటలకు తమన్నా కళ్లలో నీళ్లు ఆగలేదు.

ఆమె ఏం మాట్లాడకుండానే కూర్చుండి పోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube