మెగాస్టార్ లిప్ లాక్.. ఏ సినిమాలోనో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలలో నటించినప్పటికీ ఏమాత్రం పరిధి దాటకుండా నటించడం మెగాస్టార్ కి చెల్లుతుందని చెప్పవచ్చు.

 Mega Star Chiranjeevi, Tollywood, Lip Lock, Gharana Mogudu,latest Tollywood News-TeluguStop.com

ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగాస్టార్ ప్రస్తుత హీరోలకు ధీటుగా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ అభిమానులను సందడి చేస్తున్నారు.

చిరంజీవి తన సినిమాలలో హీరోయిన్ లతో రొమాంటిక్ సన్నివేశాలలో నటించినప్పటికీ ఎక్కడ హద్దులు దాటకుండా నటించే చిరు ఒక సినిమాలో హీరోయిన్ లిప్ లాక్ చేశారు.

మరి ఆ సినిమా ఏది అనే విషయానికి వస్తే.నగ్మా, చిరంజీవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన “ఘరానా మొగుడు”.ఈ సినిమాలో పండు పండు అనే సాంగ్ ఎంతో ఫేమస్ అయింది.

Telugu Gharana Mogudu, Lip Lock, Chiranjeevi, Tollywood-Movie

ఈ పాటలో మెగా స్టార్ హీరోయిన్ నగ్మా కు లిప్ లాక్ చేయాల్సి ఉంది.ఈ సీన్లో నటించడానికి మెగాస్టార్ ఎంతో అయిష్టత వ్యక్తం చేశారు.అయినా ఈ సీన్ చేయక తప్పనప్పటికీ అయిష్టంగానే లిప్ లాక్ చేశారు.

ఈ సన్నివేశంలో నటించి ఇంటికి వెళ్ళిన తర్వాత చిరంజీవికి ఆ రోజు రాత్రి మొత్తం నిద్ర పట్టట్లేదని వెంటనే మరుసటి రోజు మద్రాసుకు వచ్చి ఎడిటింగ్ ల్యాబ్ కు వెళ్లి ఆ సన్నివేశాన్ని ఎడిటింగ్ లో తీసేయించారు.అందు వల్ల ఈ లిప్ లాక్ సీన్ మనకు సినిమాలో కనిపించదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube