గుడ్‌ న్యూస్‌ : మెగాస్టార్‌ కు అసలు కరోనానే రాలేదు

మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా పాజిటివ్‌ అంటూ వెళ్లడయిన వెంటనే మెగా ఫ్యాన్స్‌ తో పాటు ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వారు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు.చిరంజీవి వెంటనే కోలుకోవాలంటూ పూజలు ప్రార్థనలు చేశారు.

 Mega Star Chiranjeevi Don't Have Corona First Test Is Fail , Mega Star Chiranjee-TeluguStop.com

ఆయన ఆరోగ్యం గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ పోస్ట్‌లు వచ్చాయి.అయితే చిరంజీవి ఆరోగ్యం విషయంలో మెగా ఫ్యాన్స్‌తో పాటు అందరికి కూడా అతి పెద్ద శుభవార్త.

అది ఏంటీ అంటే చిరంజీవికి అసలు కరోనా రాలేదు.మొదటి టెస్టులో రిపోర్ట్‌ తప్పు రావడం వల్లే ఈ గందరగోళం ఏర్పడినట్లుగా తెలుస్తోంది.

అప్పుడప్పుడు కరోనా టెస్టింగ్‌ కిట్‌ లు విఫలం అవుతూ ఉంటాయి.ఆ విషయం గతంలో కూడా నిరూపితం అయ్యింది.

ఇప్పుడు చిరంజీవి వల్ల కూడా నిరూపితం అయ్యింది.

తనకు కరోనా లేదు అనే విషయాన్ని సంతోషంగా చిరంజీవి నిన్న రాత్రి సమయంలో ప్రకటించాడు.

ఆయన ట్విట్టర్‌ లో తెలియజేస్తూ ఆదివారం టెస్టకు వెళ్లగా అక్కడ పాజిటివ్‌ అంటూ రావడంతో ఆందోళన చెందాను.రెండు రోజులు అయినా ఎలాంటి సింమ్టమ్స్‌ లేకపోవడంతో అనుమానం వచ్చి అపోలో ఆసుపత్రి వైధ్యులను సంప్రదించగా వారు సీటీ స్కాన్‌ చేశారు.

అందులో నెగటివ్‌ వచ్చింది.ఆ విషయాన్ని మరింత కన్ఫర్మ్‌ చేసుకునేందుకు గాను టెంట్‌ అనే ల్యాబ్‌ లో కూడా పరీక్షలు చేయించుకున్నాను.

అక్కడ మూడు రకాల కిట్‌ లతో పరీక్షలు నిర్వహించారు.

అక్కడ నెగటివ్‌ వచ్చింది.ఇక చివరికి నాకు ఎక్కడ అయితే ఏ కిట్‌ తో అయితే పాజిటివ్‌ వచ్చిందో మళ్లీ అక్కడకే వెళ్లి టెస్టు చేయించుకోగా ఈసారి నెగటివ్‌ వచ్చింది.దాంతో మొదట టెస్ట్‌ చేసిన కిట్‌ ఫెయిల్‌ అయ్యింది అంటూ వైధ్యులు చెప్పారు.

కనుక నాకు కరోనా లేదు అన్నట్లే అంటూ చిరంజీవి ట్విట్టర్‌ లో పేర్కొన్నాడు.ఈ సమయంలో నాకోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు.చిరంజీవి కరోనా నెగటివ్‌ అంటూ వెళ్లడి అయిన నేపథ్యంలో ఆయనతో సినిమాకు కొరటాల ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నాడు.ఆచార్య సినిమా షూటింగ్‌ కు వెళ్లడం కోసం చిరు కరోనా పరీక్ష చేయించుకోగా ఈ గందరగోళం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube