చిరంజీవి మరో దాతృత్వం.. ఈసారి ముఠామేస్త్రీ విలన్ కోసం

టాలీవుడ్‌ మెగా స్టార్‌ చిరంజీవి దాతృత్వంలో కూడా మెగా స్టార్‌ అనిపించుకుంటూ మెగా మనసును చాటుకుంటున్నారు.మూడు దశాబ్దాలుగా చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.

 Mega Star Chiranjeevi Donates 2 Lakhs To Tamil Actor Ponnambalam Kidney Operatio-TeluguStop.com

తనకు సాధ్యం అయినంత వరకు సాయం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్న మెగా స్టార్‌ చిరంజీవి ఈమద్య కాలంలో తన అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి సాయంగా నిలుస్తున్నారు.ఇటీవల కరోనాతో మృతి చెందిన టీఎన్నార్ కుటుంబానికి తనవంతు తక్షణ సాయంగా లక్ష రూపాయలను అందించారు.

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పావల శ్యామలకు చిరంజీవి ఆర్థికంగా సాయం అందించారు.ఎంతో మందికి సాయం అందిస్తున్న చిరంజీవి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.

నటుడు పొన్నాంబళం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి సాయం చేశారు.

ముఠామేస్త్రీ సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన పొన్నాంబళం ఆ తర్వాత చిరంజీవి తో ఎన్నో సినిమాల్లో నటించాడు.

తమిళ నటుడు అయిన పొన్నాంబళం ఇటీవల కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చేరాడు.తీవ్ర అనారోగ్యం పాలయ్యిన ఆయనకు ఆపరేషన్‌ చేయాలంటూ వైధ్యులు అన్నారట.దాంతో ఆయనకు ఆర్థికంగా రెండు లక్షల సాయంను చిరంజీవి అందించాడట.చిరంజీవి సాయంను పొన్నాంబళం సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు.

ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని చిరంజీవి గారి సాయం తో తాను బాగు పడ్డానంటూ చెప్పుకొచ్చాడు.పొన్నాంబళం సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని చెప్పే వరకు చిరంజీవి చేసిన ఆర్థిక సాయం తాలూకు విషయం ఎవరికి తెలియదు.

చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలను సైలెంట్‌ గా చేస్తాడు అనేందుకు ఇదే నిదర్శణం అంటూ చిరు అభిమానులు అంటున్నారు.ఆర్థికంగా చిరంజీవి ఈమద్య కాలంలో ఎంతో మందికి సేవ అందించడంతో పాటు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు ఒక ఆక్సీజన్ ప్లాంట్‌ ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube