మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఎదురు చూపులకు ఎట్టకేలకు తెర పడింది.ఇటీవలే సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ చిరంజీవి ఆచార్య సెట్ లో జాయిన్ అయ్యాడు.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో భారీ ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటూ చకచక షూటింగ్‌ను ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను అల్యూమీనియనం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో చేస్తున్నారు.
వచ్చే నెలలో భారీ సెట్టింగ్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించేందుకు సిద్దం అవుతున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అయిదు కోట్లతో ఒక భారీ దేవాలయాల సెట్టింగ్‌ను నిర్మిస్తున్నారట.
ఆ విషయంపై ఇప్పటికే సినీ వర్గాల నుండి క్లారిటీ వచ్చింది.ఇక సినిమా విడుదల విషయమై సస్పెన్స్ నెలకొంది.
ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది ఎప్పుడు సినిమా విడుదల అవుతుందని ఎదురు చూసిన అభిమానులకు సంక్రాంతి రోజున ఆసక్తికర అప్డేట్ను ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.
సంక్రాంతికి సినిమా టీజర్‌ను విడుదల చేసి అందులో సినిమా రిలీజ్ తేదీపై క్లారిటీ ఇవ్వబోతున్నారు.అన్ని అనుకున్నట్లుగా సాఫీగా సేఫ్ గా సాగితే ఖచ్చితంగా సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.ఆ సమయంలో పరీక్షలు ఉంటే మాత్రం మే లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారనే వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి ఆచార్య సినిమా విడుదల తేదీ విషయంలో సంక్రాంతికి ఒక స్పష్టమైన క్లారిటీ మాత్రం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
అన్ని వర్గాల వారు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా దీనికి వెయిట్ చేస్తున్నారు అనడంలో సందేహం లేదు.
ఇంత ఎదురు చూస్తున్నందుకు మరో కారణం ఈ సినిమాలో చరణ్ నటించడం.తండ్రి కొడుకులు పూర్తి స్థాయిలో కలిసి నటించడం ఇదే ప్రథమం.
కనుక అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.