మూడు విషయాలపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి  

mega star chiranjeevi about that three movies rumors , Chiranjeevi, Acharya, Lucifar, Vedhalam, Mehar Ramesh, Koratala Siva, Ramcharan - Telugu Acharya, Chiranjeevi, Koratala Siva, Lucifar, Mehar Ramesh, Ramcharan, Vedhalam

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య సినిమాతో పాటు రాబోయే రోజుల్లో ఆయన నటించబోతున్న రెండు రీమేక్ సినిమాల గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.ఆ సినిమాలకు సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో చిరంజీవి ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

TeluguStop.com - Mega Star Chiranjeevi About That Three Movies Rumors

ఒకేసారి మూడు సినిమాలకు సంబంధించిన విషయాలపై ఆయన స్పందించారు.

మొదటగా ఆచార్య సినిమా లో రామ్ చరణ్ ఉన్నాడా లేదా అనే విషయంపై స్పష్టత ఇచ్చారు.

TeluguStop.com - మూడు విషయాలపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

జక్కన్న సినిమా షూటింగ్ కారణంగా ఆచార్య నుండి రామ్ చరణ్ తప్పుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.ఆ వార్తలు నిజం కాదంటూ చిరంజీవి కొట్టిపారేశారు.ఆచార్య సినిమా లో రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు చిరు క్లారిటీ ఇచ్చారు.ఆచార్య తర్వాత చేయబోతున్న సినిమా తమిళ్ లో సూపర్ హిట్ మూవీ వేదళం రీమేక్‌ అంటూ చిరంజీవి చెప్పారు.

ఆ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నారు.ఇప్పటికే ఆ రీమేక్‌ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందని త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం అన్నారు.

ఇక చివరిదైన మూడో విషయానికొస్తే మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్.ప్రస్తుతానికి దానిని పక్కకు పెట్టారనే పుకార్లపై చిరంజీవి మాట్లాడుతూ వేదాళం షూటింగ్ పూర్తయిన తర్వాత లూసిఫర్ రీమేక్లో నటించనున్నట్లుగా తెలియజేశారు.ఆ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తారు.ఆచార్య తర్వాత వరుసగా వేదాళం మరియు లూసిఫర్ సినిమాలను రీమేక్ చేయబోతున్నట్లు మెగాస్టార్ ప్రకటించారు.

మరోవైపు బాబి దర్శకత్వంలో కూడా చిరు ఒక సినిమా చేయాల్సి ఉంది.ఆ సినిమాకు సంబంధించి త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఆచార్య సినిమాను వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ చివర్లో విడుదల చేయబోతున్నారు.

వేదాళం రీమేక్‌ ను వచ్చే ఏడాది చివర్లో ఇక లూసిఫర్ రీమేక్‌ ను 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.

సైరా షూటింగ్‌ ఆలస్యం అవ్వడం మరియు కరోనా కారణంగా సినిమా సినిమాకు చాలా గ్యాప్‌ వచ్చింది.ఇకపై అలా గ్యాప్‌ రాకుండా చిరంజీవి చక చకా సినిమాలు చేయాలని భావిస్తున్నారు.

అందుకే మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లుగా మెగా వర్గాల వారు అంటున్నారు.

#Lucifar #Koratala Siva #Acharya #Mehar Ramesh #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mega Star Chiranjeevi About That Three Movies Rumors Related Telugu News,Photos/Pics,Images..