రాజధాని విషయంలో చిరంజీవిపై అశ్వినీదత్ విమర్శలు  

Mega Producer Comments On Chiranjeevi-ap Politics,chiranjeevi,mega Producer Comments,tollywood

స్టార్ నిర్మాత, చిరంజీవితో జగదీక వీరుడు-అతిలోక సుందరి లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన వ్యక్తి అశ్వినీదత్.సినిమాల పరంగా చిరంజీవికి అత్యంత సన్నిహితుడుగా పేరున్న ఈ బడా నిర్మాతకి ఎన్టీఆర్ అంటే వీరాభిమానం అని చెప్పాలి.

Mega Producer Comments On Chiranjeevi-ap Politics,chiranjeevi,mega Producer Comments,tollywood తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీయ నాయక-Mega Producer Comments On Chiranjeevi-Ap Politics Chiranjeevi Mega Tollywood

ఎన్టీఆర్ తో సినిమాలు తీయడం కోసం నిర్మాతగా మారిన ఇతను తెలుగు దేశం పార్టీకి పరోక్షంగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు.ఇదిలా ఉంటే చాలా కాలంగా రాజకీయాలకి దూరంగా ఉన్నారు.

అయితే తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో రాజధాని అంశం మీద అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి మీద విమర్శలు చేశారు.

పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా ఒకే చెబితే కోట్ల రూపాయిలు వస్తాయని వాటిని వదులుకొని జనంలోకి వచ్చి ప్రజల కోసం, ప్రస్తుతం రాజధాని రైతుల కోసం పోరాటం చేస్తూ ఉంటే చిరంజీవి గుడ్డిగా ఏమీ ఆలోచించకుండా మూడు రాజధానులకి ఎలా మద్దతు ఇస్తారని అన్నారు.

ఆ మాటలని చిరంజీవి విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు.అలాగే ఇండస్ట్రీలో నటులు కూడా ఈ విషయాల మీద స్పందించాలని, వారి సినిమాలు చూడటం మానేస్తే చచ్చినట్లు ఎవరైనా జనం ముందుకి వచ్చి మాట్లాడాల్సిందే అని చెప్పారు.

పృధ్వీ లాంటి వారు ఆ పార్టీని బ్రస్టుపట్టిస్తున్నారని, అతని వాఖ్యాలకి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.వైఎస్ చేసిన మంచి పనులలో పది శాతం జగన్ చేసిన గొప్ప నాయకుడు అనిపించుకుంటాడని, అయితే అతని పరిపాలన చూస్తూ ఉంటే అలా ఎక్కడ కనిపించడం లేదని అన్నారు.

మరి ఒక నిర్మాతగా, చిరంజీవి సన్నిహితుడుగా ఉన్న అశ్వినీదత్ చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా ఫాన్స్ కాని, చిరంజీవి గాని ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

.

తాజా వార్తలు