యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ తో గరుడవేగ సినిమా తీసి హిట్ అందుకున్న డైరక్టర్ ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం కింగ్ నాగార్జునతో సినిమా చేస్తున్నారు.ఇక నాగ్ సినిమా తర్వాత డైరక్టర్ ప్రవీణ్ సత్తారు మెగా హీరోతో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రవీణ్ సత్తారు సినిమా మొన్నటిదాకా చర్చల్లో ఉండగా లేటెస్ట్ గా ఈ కాంబో సినిమా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది.ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తారని టాక్.
ప్రస్తుతం వరుణ్ తేజ్ గని, F3 సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఈ రెండు సినిమాల తర్వాత ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.రొటీన్ పంథాలో కాకుండా తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయిన వరుణ్ తేజ్ సినిమా సినిమాకు కెరియర్ గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు.
గని బాక్సింగ్ నేపథ్యంతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తుండగా ఎఫ్3 సినిమా వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసే కామెడీ హంగామాతో వస్తుంది.ఈ రెండు సినిమాల మీద వరుణ్ తేజ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ప్రవీణ్ సత్తారు సినిమా కూడా డిఫరెంట్ స్టోరీతో వస్తుందని చెప్పుకుంటున్నారు.