పెళ్లి చూపులు చిత్రంలో ఆ మెగా హీరోని హీరోగా అనుకున్నా...  కానీ...

తెలుగులో టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “పెళ్లి చూపులు” చిత్రం సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా బ్యూటిఫుల్ యంగ్ హీరోయిన్ రీతు వర్మ నటించగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు.

 Mega Prince Varun Tej Is First Choice Is In Pelli Choopulu Movie-TeluguStop.com

అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించాడు.ఎలాంటి అంచనాలు లేకుండా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా దర్శక నిర్మాతలకు కాసుల పంట పండించింది.

 అయితే తాజాగా ఈ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన పాల్గొని ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు తాను పడిన కష్టాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

 Mega Prince Varun Tej Is First Choice Is In Pelli Choopulu Movie-పెళ్లి చూపులు చిత్రంలో ఆ మెగా హీరోని హీరోగా అనుకున్నా…  కానీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా మొదటగా ఈ చిత్ర కథ స్క్రిప్టు పనులు జరుగుతున్నప్పుడు తనకి టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఎంతగానో సహాయం చేసిందని తెలిపాడు.

ఈ చిత్రం కోసం నిర్మాతని వెతుకుతున్న సమయంలో తన తండ్రి మరణించాడని దాంతో ఎలాగైనా తన తండ్రి సంవత్సరికం జరిగే లోపు సినిమా తీసి విడుదల చేస్తానని తన తల్లికి మాటిచ్చాడట.ఈ క్రమంలో రోజు పలువురి నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగే వాడినని తెలిపాడు.

అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పాటూ మరో ఐదారుగురు టాలీవుడ్ హీరోలు ఈ కథను విన్నారని,  కానీ చివరికి విజయ్ దేవరకొండని హీరోగా తీసుకున్నామని తెలిపాడు.

ఇక నిర్మాత విషయంలో చాలా కష్టాలు ఎదుర్కొన్న తనకి నిర్మాత రాజ్ కందుకూరి డబ్బులు పెట్టేందుకు ముందుకు రావడంతో అనుకున్నదే తడవుగా సినిమా పనులు మొదలు పెట్టామని తెలిపాడు.

ఈ చిత్రాన్ని తెరకెక్కించడం కోసం చాలా కష్టాలు పడినప్పటికీ ఫలితం మాత్రం కష్టాలన్నింటిని దూరం చేసిందని తెలిపాడు.అంతేగాక తన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తరుణ్ భాస్కర్ తమిళంలో మంచి విజయం సాధించిన “ఓ మై కడవలే” అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.అలాగే ఆ మధ్య టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన “మిడిల్ క్లాస్ మెలోడీస్” చిత్రం లో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో కనిపించాడు.

#TarunBhaskar #Varun Tej #MegaPrince

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు