మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గని.బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరన సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.సినిమా కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ నేర్చుకున్నాడు.ఈ సినిమా బడ్జెట్ 42 కోట్ల దాకా అయ్యిందని టాక్.సినిమా డిజిటల్, శాటిలైట్ డీల్ క్లోజ్ అయ్యిందని తెలుస్తుంది.వరుణ్ తేజ్ గని సినిమాను డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ మొత్తం కలిపి 23 కోట్లకు కొనేశారట.
సినిమా బడ్జెట్ లో సగం వీటి ద్వారా రాగా థియేట్రికల్ రిలీజ్ ద్వారా మిగతాది రాబట్టాలని చూస్తున్నారు.
గని సినిమా మీద వరుణ్ తేజ్ ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు.
సినిమా కోసం మెగా హీరో చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది.ఆ కష్టం అంతా తెర మీద కనిపిస్తుందని అంటున్నారు.
నూతన దర్శకుడే అయిన కిరణ్ కొర్రపాటి అనుభవం ఉన్న డైరక్టర్ గా సినిమా తెరకెక్కించారని అంటున్నారు.సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ పలికిన రేటు చూస్తుంటే థియేట్రికల్ రైట్స్ తో సినిమా ముందే లాభాల బాట పట్టేలా ఉందని చెప్పొచ్చు.
గనితో పాటుగా వరుణ్ తేజ్ f3 సినిమాలో కూడా నటిస్తున్నారు.గని సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.