మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సర్ సినిమా షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు.రీసెంట్ గా చెల్లి పెళ్లి చేసిన తరువాత కంప్లీట్ గా బాక్సర్ షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొని విరామం లేకుండా షూట్ లో పాల్గొంటున్నాడు.
లాక్ డౌన్ కి ముందే కొంత టాకీ పార్ట్ విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు.ప్రస్తుతం అక్కడే షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్నాడు.ఇక బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నాభా నటేష్ నటిస్తూ ఉండగా మరో ప్రధాన పాత్రలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నాడు.
అతని పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది.సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత మరోసారి ఉపేంద్ర మెగా హీరో సినిమాతో తెలుగులో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది.ఇక ఈ సినిమాకి సంబందించిన ఆసక్తికర అప్డేట్ చిత్ర యూనిట్ నుంచి తాజాగా వచ్చింది.
ఈ నెల 19న బాక్సర్ సినిమా నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.ఈ విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ గా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
ఇక ఇందులో పూర్తి గెడ్డంతో సరికొత్త లుక్ లో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు.ఇప్పటికే బాక్సర్ సినిమాలో అతని లుక్ కి సంబందించిన ఫోటోలు కొన్ని బయటకి వచ్చాయి.
ఈ నేపధ్యంలో బాక్సర్ పాత్రలో వరుణ్ ఎలా కనిపిస్తాడని ఆసక్తి మెగా అభిమానులలో ఉంది.