ప్రభాస్ తో రామ్ చరణ్ పోటీ.. Rc17 అలా ఫిక్స్?

ప్రభాస్ తో రామ్ చరణ్ పోటీ.. Rc17 అలా ఫిక్స్?

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలను చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

 ప్రభాస్ తో రామ్ చరణ్ పోటీ.. Rc17 అలా ఫిక్స్?-TeluguStop.com

ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి.ఇదిలా ఉండగా ప్రభాస్ కు పోటీగా మరో టాలీవుడ్ స్టార్ హీరో వరుస పాన్ ఇండియా చిత్రాలను ఒప్పుకుంటూ ప్రభాస్ కు పోటీగా వెళ్తున్నారని చెప్పవచ్చు.

ఇప్పటికే రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా తన తరువాత సినిమాను శంకర్ దర్శకత్వంలో ప్రకటించారు.ఇక రామ్ చరణ్ 16 వ సినిమాను విజయ దశమి సందర్భంగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఉండబోతుందని అధికారికంగా ప్రకటించారు.

 ప్రభాస్ తో రామ్ చరణ్ పోటీ.. Rc17 అలా ఫిక్స్?-ప్రభాస్ తో రామ్ చరణ్ పోటీ.. Rc17 అలా ఫిక్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Prabhas, Prashanth Neel, Ram Charan, Rc-Movie

ఇకపోతే రామ్ చరణ్ తన 17 సినిమాని కూడా పాన్ ఇండియా దర్శకుడు కే జి ఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన 17 వ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే పండుగ రోజు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి , డివివి దానయ్య కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ప్రభాస్ సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.ఇక ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేయాల్సి ఉంది.

#Ram Charan #Prashanth Neel #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube