మగధీర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న రామ్ చరణ్  

Ram Charan remembers SS Rajamouli\'s Magadheera, Mega Power star, Jakkanna, Ram charan, Magadheera Movie - Telugu Jakkanna, Magadheera Movie, Mega Power Star, Ram Charan, Ram Charan Remembers Ss Rajamouli\\'s Magadheera

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం మగధీర.రామ్ చరణ్ రెండో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అతనికి ఏకంగా స్టార్ హీరో ఇమేజ్ తీసుకోచ్చేసింది.

 Mega Power Star Ramcharan Jakkanna Ram Charan Magadheera Movie

జక్కన్న దర్శకత్వ మాయాజాలంతో సినిమాని విజువల్ వండర్ గా ఆవిష్కరించారు.కాజల్ ఆగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కథ పునర్జన్మల నేపధ్యంలో ప్రేమకథా చిత్రంగా జక్కన్న తెరకెక్కించారు.

ఇక సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా తెరపైకి వచ్చి ఇప్పటికి 11 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

మగధీర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న రామ్ చరణ్-Movie-Telugu Tollywood Photo Image

ఈ నేపథ్యంలో ఓ ప్రత్యేక వీడియో ఆన్ లైన్ లో సందడి చేస్తోంది.ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మగధీర చిత్రం తనకో మధురానుభూతి అని, తనను ముందుకు నడిపించిన చిరస్మరణీయ అనుభవం అని పేర్కొన్నారు.ఆ చిత్రం తనలోని ప్రతి నైపుణ్యానికి పరీక్ష పెట్టిందని తెలిపారు.

మగధీర చిత్రీకరణ సమయంలో చిత్ర యూనిట్ చూపించిన ప్రేమానురాగాలకు ముగ్ధుడ్నయ్యానని, విడుదలైన తర్వాత ప్రేక్షకుల ఆదరణ తనను మరింత సంతోషానికి గురిచేసిందని వివరించారు.రాజమౌళి గారూ, పరిధులు దాటి ప్రతిభ చూపేలా నన్ను మీరెంతో ప్రోత్సహించారు, అంతేకాదు, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుందని నాకు బోధించారు అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

ఇక ఈ సినిమా 11 ఏళ్ళు అయిన సందర్భంగా రాజమౌళికి, రామ్ చరణ్ కి ఫ్యాన్స్ నుంచి ప్రత్యేక అభినందనలు అందుతున్నాయి.ఇక వీరి కాంబినేషన్ లో మరోసారి విజువల్ వండర్ గా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోతున్నాడు.ఇక ఇండస్ట్రీలో రేర్ కాంబినేషన్ లో ఇందులో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ సందడి చేస్తున్నాడు.

#Mega Power Star #Jakkanna #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mega Power Star Ramcharan Jakkanna Ram Charan Magadheera Movie Related Telugu News,Photos/Pics,Images..