ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా..?

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో “మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్” కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు.అయితే రామ్ చరణ్  సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకుని ప్రేక్షకులలో మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు.

 Mega Power Star Ram Charan Tej Photos Viral In Social Media, Ram Charan Tej, Meg-TeluguStop.com

అంతేగాక తన సినీ కెరీర్ లో చిరుత, మగధీర, రంగస్థలం, ఎవడు, తదితర  బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

కాగా తాజాగా రామ్ చరణ్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

  అయితే ఈ ఫోటోలను పీకసారి పరిశీలిస్తే రామ్ చరణ్ సినిమాల్లోకి రాక ముందు ఎలా ఉండేవాడో స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా రామ్ చరణ్ ఎక్కువగా జుట్టు పెంచుకుని, మీసం లేని యువకుడిగా కనిపిస్తున్నాడు.

 ఆ తర్వాత సినిమాల్లోకి రావడంతో తన పాత్రలకి తగ్గట్టుగా పూర్తిగా తన గెటప్ ని  మరియు స్టైల్ ని మార్చేశాడు. దీంతో కొందరు రామ్ చరన్ అభిమానులు ఈ ఫోటోలు తెగ లైక్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ తెలుగులో ప్రముఖ దర్శకుడు “ఎస్ఎస్ రాజమౌళి” దర్శకత్వం వహిస్తున్న “ఆర్.ఆర్.ఆర్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్  చరణ్ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామ రాజు పాత్ర లో  కనిపించనున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర కు సంబంధించిన టీజర్ విడుదల కాగా మంచి ప్రేక్షకాదరణ లభించింది. అంతేగాక ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగి పోయాయి.

 అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు  ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో మరింత ఆలస్యం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube