అమెరికా చరిత్రలోనే భారీ లాటరీ..ఎంతో తెలిస్తే షాకే..!!!   Mega Millions Jackpot In America     2018-10-22   10:37:03  IST  Surya

లాటరీలు ఈ పేరు వింటే ముందుగా గుర్తొచ్చేది సౌదీ కంట్రీస్. ఇక్కడ నెలకి ఒక సారి తీసే లాటరీలు ప్రభుత్వ అనుమతులతో ఎంతో పకడ్బందీగా ఉంటాయి.అంతేకాదు కోట్లలో ఈ మొత్త లాటరీల విలువ ఉంటుంది..ముఖ్యంగా అక్కడ వలసలకి వెళ్ళిన భారతీయులకి ఈ లాటరీలు ఒక్క సారిగా తగలటంతో కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు..ఇదిలాఉంటే ఇప్పుడు అమెరికా చరిత్రలోనే అత్యంత విలువైన భారీ లాటరీని ప్రవేశపెట్టింది.

భారీ మొత్తం నగదు బహుమతిని ఇచ్చే లాటరీని మంగళవారం రోజు డ్రా తీయనున్నారు. మె గా మిలియన్ జాక్‌పాట్‌గా పేర్కొనే ఈ డ్రాలో గెలుపొందిన వారికి 160 కోట్ల డాలర్లు..అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.11756 కోట్ల ని బహుమతిగా ఇస్తారు. నోళ్ళు వెళ్ళబెట్టారా..?? మరి ఆశ్చర్యపోక ఎలా ఉంటాము చెప్పండి. అయితే శుక్రవారమే డ్రా నిర్వహించినా ఎవరూ దీనిని గెలుచుకోలేకపోయారు.

అయితే ఆ డ్రాలో 15, 23, 53, 65, 70, మెగా బాల్ 7 నంబర్లను అందుకోలేకపోయారు. మంగళవారం నిర్వహించే డ్రాలో ఈ ఆరు నంబర్లను సాధించగలిగితే ఈ జాక్‌పాట్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే విజేతలకు రెండు విధాలుగా ప్రైజ్‌మనీ అందుబాటులో ఉంటుంది. అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే 90.4 కోట్ల డాలర్లు అంటే రూ.6600 కోట్లు అందజేస్తారు…మొత్తం కావాలంటే ఇనిస్టాల్మెంట్ గా 29 ఏండ్లలో ఇచ్చేస్తారు. ఏంటి మీరు కూడా ఆ టిక్కెట్ కొనుక్కుని ఉంటే బాగుండేది అనుకుంటున్నారా..!!!